అనంతగిరి: మోదీ సుపరిపాలన చూసి ఓర్వలేక కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రమేష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని, అతని తండ్రిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదన్నారు. మంగళవారం వికారాబాద్‌లోని ఎన్టీఆర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ దిష్టి బొమ్మ దహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోదీ స్వచ్ఛమైన నాయకుడన్నారు. ఆయనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికై నా అనవసర ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. కాంగ్రెస్ కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో ఆ పార్టీకి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. పోలీసులు దిష్టి బొమ్మ దహనాన్ని అడ్డుకున్నారు. బీజేపీ నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షురాలు యాస్కీ శిరీష, రాష్ట్ర నాయకులు శివరాజ్, పాండు గౌడ్, భద్రేశ్వర్, కేశవులు, అనిల్ కుమార్ యాదవ్, వివేకానంద రెడ్డి, శ్రీధర్ రెడ్డి, నవీన్ కుమార్, మల్లేశ్, పటేల్ మల్లేశం, సాయి చరణ్ రెడ్డి, హరికృష్ణ, శ్రీకాంత్ రెడ్డి, రమేష్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడు రమేష్ కుమార్
వికారాబాద్‌లో నిరసన కార్యక్రమం
అదుపులోకి తీసుకున్న పోలీసులు


