సీఎంకు ఓటమి భయం | - | Sakshi
Sakshi News home page

సీఎంకు ఓటమి భయం

Sep 7 2026 10:44 AM | Updated on Sep 7 2026 10:44 AM

మహబూబ్‌నగర్‌లో రేవంత్‌కు ఎనిమిదో స్థానం

మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి

బొంరాస్‌పేట: సీఎం రేవంత్‌రెడ్డికి ఇప్పటికే ఓటమి భయం చుట్టుకుందని కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో బీఆర్‌ఎస్‌ దుద్యాల, బొంరాస్‌పేట మండలాల నాయకులతో కలిసి పాత పోలీసు స్టేషన్‌ నుంచి భూలక్ష్మి చౌరస్తా వరకు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యేల్లో ఎనిమిదవ స్థానంలో ఉన్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయని, తనకు రాబోయే ఎన్నికల్లో ఓటమి తప్పదనే భయం చుట్టుకుందని విమర్శించారు. సీఎం వచ్చిన ప్రతిసారి బీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకులపై నిర్భందాలు ఎందుకని ప్రశ్నించారు. ఇలాగే కొనసాగితే ప్రజలు మిమ్మల్ని రానివ్వకుండా తిరగబడే రోజులొస్తాయని హెచ్చరించారు. రేవంత్‌రెడ్డికి తమ అధినేత కేసీఆర్‌ను ప్రశ్నించే అర్హత లేదన్నారు. వందకోట్లు సీఎం ఫ్యామిలీకే ఖర్చు పెడుతున్నారని ఆరోపించారు. కొడంగల్‌ ప్రాంతంలో తన హయాంలోనే అభివృద్ధి పనులు చేశానని అన్నారు. ప్రస్తుతం ఇళ్లు, పెన్షన్లు, ఫైరవీలు చేస్తూ డబ్బులు దండుకుంటున్నారన్నారు. నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణం కోసం ఇళ్లు, భూములు కోల్పోతున్న బాధితులకు న్యాయం జరిగేలా పోరాడతామన్నారు.

నేడు ప్రజావాణిలో..

బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో నేడు సోమవారం ప్రజావాణిలో తమ వినతులు, ఫిర్యాదులు స్వేచ్ఛగా అందజేయాలనే కార్యక్రమం చేపట్టామన్నారు. అందుకు అవసరమైన వినతిపత్రాలను తయారు చేసి పార్టీ నాయకులు, కార్యకర్తల వద్ద ఉంచామని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు మహేందర్‌రెడ్డి, యాదగిరి, శేరి నారాయణరెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, చాంద్‌పాషా, లగచర్ల సురేశ్‌, మధుయాదవ్‌, శ్రీనివాస్‌, మహేందర్‌, రమణారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, తిరుపతయ్య, వెంకటయ్య, సలామ్‌, బుగ్గప్ప, తదితరులున్నారు.

గిరిజనులకు అండగా ఉంటా

నియోజవకగర్గంలోని గిరిజనులకు అండగా ఉంటానని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. ఇటీవల ఫారెస్టు అధికారులు మండలంలోని ఏనెమీదితండా పంచాయతీ ఊరెనికితండాలో కూల్చిన ఇంటిని ఆదివారం మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి సందర్శించి బాధిత రవినాయక్‌, తండావాసులతో మాట్లాడారు. జిల్లా కలెక్టర్‌ని కలిసి న్యాయం జరిగేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇటీవల తాండూరు పట్టణంలో ఇంటిదొంగతనం సంఘటనలో తీవ్రంగా గాయపడి కోలుకున్న వడిచర్లకు చెందిన మాజీ సర్పంచ్‌ పట్లోళ్ల ఉమాదేవి నరేందర్‌రెడ్డి, నాయకులు పరామర్శించారు. కోట్ల యాదగిరి, మహేందర్‌రెడ్డి, రాజుగౌడ్‌, శ్రీనివాస్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, మల్‌రెడ్డి, రవిచారి, రవిగౌడ్‌, తూక్యారామ్‌, బాబ్యానాయక్‌లున్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement