ధారూరు: మండల కేంద్రంలోని వీరభద్రేశ్వర ఆలయంలో ఆదివారం లక్ష బిల్వార్చన పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్వర్యంలో పూజారులు చెన్న బసవయ్యస్వామి, కుమార స్వామి ఉదయం 8 గంటల నుంచి కపిలేశ్వరస్వామికి రుద్రాభిషేకం చేశారు. గణనాథుడు, కుమారస్వామి, నందీశ్వరుడు, వీరభద్రస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. పార్వతీమాత శాకాంబరీదేవిగా దర్శనమిచ్చారు. పార్వతిమాత, కపిలేశ్వరస్వామి కల్యాణం నిర్వహించి కళ్యాణ వివరణను బీరంగుడకు చెందిన గౌతంస్వామి, సంగారెడ్డి అర్చక సంఘం అధ్యక్షుడు సంతోష్‌కుమార్ భక్తులకు అందించారు. సాయంత్రం వీరభద్రేశ్వరుడి పల్లకీ సేవ నిర్వహించారు.


