దోమ: ఆరు గ్యారంటీలు, 420 దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం మండల పరిధిలోని దిర్సంపల్లిలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు గోపాల్ గౌడ్ అధ్వర్యంలో కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనలో పల్లెల విధ్వంసం, పడకేసిన పారిశుద్ధ్యంపై భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజలకు అందించాల్సిన సంక్షేమం, అభివృద్ధిలో పూర్తి విఫలమైందని ఆరోపించారు. కేవలం సీఎం రేవంత్‌రెడ్డి కొడంగల్ నియోజకవర్గాన్ని మాత్రమే అభివృద్ధి చేసుకుంటున్నారని, పరిగిని గాలికి వదిలేశారని మండిపడ్డారు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే సైతం ముఖ్యమంత్రుల పర్యటన, పత్రిక సమావేశాలకు మాత్రమే పరిమితం అయ్యారని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం విద్యుత్ 24 గంటలు ఇచ్చేదని, నేడు కోతలు విధిస్తుందన్నారు. విద్యార్థులకు ఫీజు రీయంబర్స్‌మెంట్ అందక ఇబ్బంది పడుతున్నారని మండిపడ్డారు.
రైతులకు అండగా ఉంటాం
మండలంలోని అనంతరెడ్డిపల్లి, కొండాయపల్లి, బట్ల చందారం రైతులకు బీఆర్‌ఎస్ పార్టీతో పాటు తాము అండగా ఉంటామన్నారు. ఇండస్ట్రియల్ పార్క్‌ల పేరుతో దాదాపు 900 ఎకరాలు ప్రభుత్వం లాక్కోవాలని చూస్తుందని, రేడియల్ రోడ్డు పేరుతో నియోజకవర్గంలోని 18 గ్రామాల నుంచి భూములు తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిపై న్యాయస్థానాలను ఆశ్రయించామన్నారు. తమతో పాటు నియోజకవర్గంలోని బీఆర్‌ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేసి అరెస్టులు చేయిస్తున్నారని జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కొప్పులు నాగిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు లక్ష్మయ్య, మాజీ ఎంపీపీ రాజాగోపాలచారి, మాజీ వైస్ ఎంపీపీ మల్లేశం, మాజీ సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు రాజిరెడ్డి, మాజీ ఎంపీటీసీలు నవాజ్‌రెడ్డి, రాములు, బీఆర్‌ఎస్ పార్టీ మాజీ అధ్యక్షుడు హన్మంతునాయక్, మాజీ కోఆప్షన్ సభ్యుడు ఖాజపాష, మండల బీఆర్‌ఎస్ పార్టీ యూత్ అధ్యక్షుడు మశ్చేందర్‌రెడ్డి, మండల అధికార ప్రతినిఽధి శశిధర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు శ్రావణ్‌రెడ్డి, సంతోష్, హైమద్‌పటేల్, హన్మంతు, గ్రామ ఉపసర్పంచ్ తిరుపతయ్య, వార్డు సభ్యులు, పరిగి మాజీ ఎంపీపీ అరవీందర్‌రావు, ఏఎంసీ మాజీ చైర్మన్ ఆర్.ఆంజనేయులు, మాజీ కోఆప్షన్ సభ్యులు మీర్‌మహాముద్‌అలీ, కౌన్సిలర్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి


