మోమిన్‌పేట/పరిగి: మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని ఎస్పీ స్నేహ మెహ్ర సూచించారు. బుధవారం మోమిన్‌పేటలోని సీఐ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మత్తుకు బానిసలైతే భవిష్యత్ అంధకారమే అన్నారు. మత్తు పదార్థాలను అమ్మినా, కొన్నా నేరమన్నారు. నేరాల నియంత్రణకు ప్రతి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మద్యం సేవించి, హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడం నేరమని తెలిపారు. అనంతరం స్టేషన్ రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అంతకుముందు స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో డీఎస్పీ అంజయ్య, సీఐ వెంకట్, ఎస్‌ఐ భరత్ భూషణ్ తదితరులు పాల్గొన్నారు.
సబ్ జైలు సందర్శన
పరిగి పట్టణంలోని సబ్ జైలును బుధవారం ఎస్పీ స్నేహ మెహ్ర సందర్శించారు. భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాలను క్షుణంగా పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. జైలు పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం ఇవ్వొద్దని సూచించారు. తరచూ తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు పోలీసులు, జైలు సిబ్బంది సమన్వయంతో తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రాజేష్‌మీనా, పరిగి డీఎస్పీ శ్రీనివాస్, ఏఆర్ డీఎస్పీ వీరేష్, సీఐ కొండల్‌రెడ్డి, సబ్ జైల్ సూపరింటెండెంట్ రాజ్‌కుమార్, ఎస్సై మోహనకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ స్నేహ మెహ్ర


