‘కొడంగల్‌’ ఎత్తిపోతలతో సస్యశ్యామలం | - | Sakshi
Sakshi News home page

‘కొడంగల్‌’ ఎత్తిపోతలతో సస్యశ్యామలం

Aug 21 2026 9:50 AM | Updated on Aug 21 2026 9:50 AM

‘కొడంగల్‌’ ఎత్తిపోతలతో సస్యశ్యామలం దౌల్తాబాద్‌: కొడంగల్‌ – నారాయణపేట ఎత్తిపోతల పథకం పూర్తయితే ఈ ప్రాంతం సస్యశ్యామలమవుతుందని తాండూరు ఆర్డీఓ అనిత అన్నారు. బుధవారం మండలంలోని గోకఫసల్‌వాద్‌లో గ్రామసభ నిర్వహించారు. ఈర్లపల్లి చెరువు స్థాయిని పెంచి అక్కడి నుంచి కుడి, ఎడమ కాల్వల ద్వారా సాగునీరు అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఇందులో భాగంగా ఈర్లపల్లి చెరువు వద్ద 469 ఎకరాల భూ సేకరణకు నోటిఫికేషన్‌ జారీ చేసినట్లు చెప్పారు. రైతులు అంగీకారపత్రాలు అందిస్తే త్వరలో పరిహారం అందుతుందని పేర్కొన్నారు. ఎత్తిపోతల పథకం పూర్తయితే కొడంగల్‌ పచ్చదనంతో పంటలు పండి రైతులకు మేలు జరుగుతుందన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ వెంకట్‌స్వామి, డీటీ వెంకటాచారి,సర్పంచ్‌ మల్లమ్మ తదితరులు పాల్గొన్నారు. వరి వంగడాలను నమోదు చేసుకోండి తహసీల్దార్‌ కార్యాలయానికి హీరో నాగచైతన్య

తాండూరు ఆర్డీఓ అనిత

జిల్లా వ్యవసాయాధికారి కవిత

అనంతగిరి: వానాకాలం సీజన్‌ – 2026లో ప్రభుత్వం సూచించిన ఏడు రకాల వరి వంగడాలు సాగు చేస్తున్న రైతులు పూర్తి వివరాలు నమోదు చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి కవిత బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు గుర్తింపు పొందిన డీలర్ల వద్ద విత్తనాలు కొనుగోలు చేసినట్లయితే, సంబంధిత డీలర్లు రైతు పేరు, విత్తన రకం వంటి వివరాలను సంబంధిత పోర్టల్‌లో నమోదు చేస్తారని తెలిపారు. సొంత విత్తనం నాటిన రైతులు వ్యవసాయ విస్తరణ అధికారి ధ్రువీకరణ పత్రం సమర్పించాలని సూచించారు. వివరాల నమోదుకు సెప్టెంబర్‌ 10వ తేదీ వరకు అవకాశం ఉన్నట్లు తెలిపారు.

అనంతగిరి: వికారాబాద్‌ పట్టణంలోని తహసీల్దార్‌ కార్యాలయానికి బుధవారం సినీ హీరో నాగచైతన్య వచ్చారు. వ్యక్తిగత పనుల నిమిత్తం వచ్చినట్లు తెలిసింది. దీంతో కార్యాలయం సందడిగా మారింది. అభిమాన హీరోను చూసేందుకు పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు.

అప్రమత్తంగా ఉండాలి

జిల్లా న్యాయసేవాధికార సంస్థ

సెక్రటరీ రాధిక

అనంతగిరి: వికారాబాద్‌ పట్టణంలోని శిశు గృహాన్ని బుధవారం జిల్లా న్యాయసేవాధికార సంస్థ సెక్రటరీ రాధిక ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు, వంటశాల, పరిసరాలను పరిశీలించారు. పిల్లలకు అందుతున్న వసతలుపై ఆరా తీశారు. విధుల్లో అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పిల్లలు ఆడుకోవడానికి అవకాశం కల్పించాలని ఆదేశించారు. సమయానుకూలంగా, క్రమం తప్పకుండా ఆహారం అందించాలని తెలిపారు.

కేసుల వారీగా సమీక్ష

అనంతగిరి: వికారాబాద్‌ పట్టణంలోని జిల్లా పోలీస్‌ కార్యాలయంలో బుధవారం ప్రాసిక్యూషన్‌ రివ్యూ కమిటీ మీటింగ్‌ జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ స్నేహమెహ్ర కోర్టు డ్యూటీ అధికారులతో కేసుల వారీగా సమీక్ష నిర్వహించారు. కేసుల దర్యాప్తు, సాక్ష్యాధారాల సేకరణ, చార్జ్‌షీట్‌ దాఖలు, కోర్టు విచారణలో ఎదుర య్యే సమస్యలు, పెండింగ్‌ కేసుల పురోగతిపై ఆరా తీశారు. కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ రాజేశ్‌ మీనా, పబ్లిక్‌ ప్రాస్యికూటర్‌ అన్వేష్‌, లీగల్‌ అడ్వయిజర్‌ అనిల్‌కుమార్‌, డీఎస్పీలు, సీఐలు, కోర్టు డ్యూటీ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement