బొంరాస్‌పేట: విద్యారంగ అభివృద్ధికి సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని ఆ పార్టీ కొడంగల్ నియోజకవర్గం ఇన్‌చార్జ్ ఎనుముల తిరుపతిరెడ్డి అన్నారు. బుధవారం దుద్యాల మండలం హంసాన్‌పల్లిలో కడా నిధులు రూ.61 లక్షలతో నిర్మించిన పాఠశాల భవనాన్ని ప్రారంభించారు. గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. రూ.30 లక్షలతో జీపీ భవనం నిర్మించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి, పీఆర్ డీఈ సురేశ్‌బాబు, ఏఈ సరేందర్‌రెడ్డి, ఎంఈఓ శంకర్, ఇన్‌చార్జ్ ఎంపీడీఓ జైపాల్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శేఖర్, నర్సింలుగౌడ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వేణుగోపాల్, సర్పంచ్ పుష్పమ్మ, హెచ్‌ఎం అంజిలయ్య, ఉపసర్పంచ్ రాములు, నాయకులు నర్సింలుగౌడ్, రాజు తదితరులు పాల్గొన్నారు.
● కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ తిరుపతిరెడ్డి
● హంసాన్‌పల్లిలో పాఠశాల భవన ప్రారంభోత్సవం
అభివృద్ధికి సహకరించాలి
కొడంగల్ రూరల్: పార్టీలకతీతంగా అభివృద్ధికి అందరూ సహకరించాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ తిరుపతిరెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని శాంతినగర్, గాంధీనగర్ ప్రాంతాల్లో నూతనంగా నిర్మించిన అంగన్‌వాడీ భవనాలు, బోరు మోటారు, అప్పాయిపల్లిలో జీపీ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. కార్యక్రమంలో కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ప్రశాంతుకుమార్, వైస్ చైర్మన్ శంకర్‌నాయక్, కమిషనర్ బలరాం నాయక్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సంజీవరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి బాల్‌రెడ్డి, కౌన్సిలర్లు సుష్మాదామోదర్, సయ్యద్ హమీద్, కో ఆప్షన్ మెంబర్ రమేష్‌బాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ అంబయ్యగౌడ్, నాయకులు ఆసిఫ్‌ఖాన్, సయ్యద్ అశ్వక్ పాల్గొన్నారు.