దేశభక్తిని చాటుతూ శుక్రవారం ధారూరు మండలం కోట్‌పల్లి ప్రాజెక్టులో లైఫ్ గార్డ్స్, బోటింగ్ సిబ్బంది కాయకింగ్ బోట్లతో తిరంగా ర్యాలీ నిర్వహించారు. జాతీయ జెండాలను చేతబట్టి బోట్లపై విహరించారు. ఈ కార్యక్రమం సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంది. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి వేడుకల్లో పాల్గొన్నారు. జేకేఎంఆర్ కోఆర్డినేటర్ రాములు ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. – ధారూరు


