కొడంగల్ రూరల్: బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్న బహుజన సమాజ్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పార్టీ అసెంబ్లీ ఇన్‌చార్జి రమేష్‌బాబు, అధ్యక్షుడు శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం మండల పరిధి కస్తూర్‌పల్లిలో బీఎస్పీ గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా టి.ఎల్లప్ప ముదిరాజ్, ఉపాధ్యక్షుడిగా భీమప్ప, ప్రధాన కార్యదర్శిగా వెంకటప్ప యాదవ్, కార్యదర్శిగా రాములు యాదవ్, కోశాధికారిగా శ్రీనివాస్ ముదిరాజ్‌లను నియమించారు. కార్యక్రమంలో పార్టీ కొడంగల్ కోశాధికారి మహ్మద్‌బాయ్, నాయకులు అన్నారం సాయిలు తదితరులు పాల్గొన్నారు.


