తాండూరు: రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా వడ్డె శ్రీనివాస్, వైస్ చైర్మన్‌గా షేక్ ఖాసింఅలీ, సభ్యులతో ఎమ్మెల్యే పదవీ ప్రమాణస్వీకారం చేయించి మాట్లాడారు. రైతుల అభ్యన్నతికి మార్కెట్ కమిటీ కృషి చేయాలని సూచించారు. తాండూరు ధాన్యానికి మంచి గ్రెడింగ్, మార్కెట్‌కు గుర్తింపు తీసుకురావడంతో పాటు.. అన్నదాతలకు మెరుగైన సేవలు అందించాలని చెప్పారు. ఏడాదిలోగా నూతన మార్కెట్ యార్డును ప్రారంభించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
కాగ్నానదిపై చెక్ డ్యాములు
కోట్‌పల్లి ప్రాజెక్టు పునరుద్ధరణ పనులు పూర్తికావస్తున్నాయని, జుంటుపల్లి, శ్రీరాముల వారి ప్రాజెక్టులను అభివృద్ధి చేసి, చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కాగ్నానదిపై చెక్ డ్యాముల నిర్మాణాలు చేపట్టి, పట్టణ ప్రజలకు నిరంతరం తాగునీటిని సరఫరా చేస్తాం. నీటి ఎద్దడికి శాశ్వత పరిష్కారం చూపుతామని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజాబాల్‌రెడ్డి, వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, డీసీసీబీ మాజీ వైస్ చైర్మన్ రవిగౌడ్, తాండూరు సర్ కన్వినర్ కరణం పురుషోత్తంరావు, పీఏసీఎస్ చైర్మన్ సురేందర్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండలాల అధ్యక్షులు నాగరాజ్, మహిపాల్‌రెడ్డి, రాజవర్ధన్‌రెడ్డి, మహిపాల్, రాజ్‌కుమార్, గ్రెన్ అండ్ సీడ్స్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కట్కం వీరేందర్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి
కొలువుదీరిన మార్కెట్ కమిటీ పాలకవర్గం


