అనంతగిరి: నేరాల నియంత్రణకు మరింత సమర్థవంతంగా పని చేయాలని ఎస్పీ స్నేహ మెహ్ర సూచించారు. శుక్రవారం వికారాబాద్ పట్టణంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. శాంతిభద్రతలు, పెండింగ్ కేసులపై ఆరా తీశారు. కేసుల దర్యాప్తులో జాప్యం జరగరాదని సూచించారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడమే మన ప్రధాన లక్ష్యమన్నారు. ప్రతి కేసును బాధ్యతగా తీసుకుని, నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలన్నారు. నిందితులకు శిక్షలు పడేలా పనిచేయాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని సైబర్ నేరాలకు చెక్ పెట్టాలని తెలిపారు. డ్రగ్స్ వలన కలిగే అనర్థాలపై విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. రికార్డుల నిర్వహణ, కేసుల నమోదు, సాంకేతిక వ్యవస్థల వినియోగంపై పలు సూచనలు చేశారు. మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. డ్రగ్స్ అక్రమ రవాణాపై నిరంతర నిఘా కొనసాగించాలని పేర్కొన్నారు. అనంతరం ఉత్తమ పనితీరు కనబరిచిన పోలీస్ అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
కేసుల దర్యాప్తులో అలసత్వం వద్దు
సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి
ఎస్పీ స్నేహమెహ్ర


