తాండూరు టౌన్: మాదిగలు అన్ని రంగాల్లో రాణించాలని ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్‌చార్జ్ గట్టగల్ల ప్రశాంత్ మాదిగ అన్నారు. శుక్రవారం తాండూరులో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మందకృష్ణ మాదిగ పోరాట ఫలితమే వర్గీకరణ అన్నారు. రిజర్వేషన్లను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మాదిగల హక్కులు, ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకునేందుకు ఐక్యంగా ఉండాలన్నారు. సెప్టెంబర్ 9న వరంగల్‌లో నిర్వహించనున్న ఎమ్మార్పీఎస్ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలన్నారు. అనంతరం తాండూరు మండల కమిటీని ఎన్నునకున్నారు. మండల అధ్యక్షుడిగా మేకల అనిల్ మాదిగ, అధికార ప్రతినిధిగా మహేందర్, ప్రధాన కార్యదర్శులుగా అశోక్, పరశురాం, ఉపాధ్యక్షులుగా హన్మంతు, బాలేష్, వెంకట్, కోశాధికారిగా బాలరాజుతో పాటు కార్యదర్శులు, సహాయ కార్యదర్శులను నియమించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా మాజీ అధ్యక్షుడు మల్లికార్జున్, నాయకులు నర్సింలు, వెంకట్, సూర్యప్రకాష్, నరేష్, శివాజీ తదితరులు పాల్గొన్నారు.
రిజర్వేషన్లను సద్వినియోగం చేసుకోవాలి
ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్‌చార్జ్ ప్రశాంత్ మాదిగ


