● దేశసేవలో తరించి..యువతను తీర్చిదిద్ది | - | Sakshi
Sakshi News home page

● దేశసేవలో తరించి..యువతను తీర్చిదిద్ది

Aug 15 2026 7:29 AM | Updated on Aug 15 2026 7:29 AM

● దేశసేవలో తరించి..యువతను తీర్చిదిద్ది

కుల్కచర్ల: మండలంలోని బండవెల్కిచర్ల గ్రామానికి చెందిన మంత్రి వెంకటేశం దేశ రక్షణ వ్యవస్థలో హవల్దార్‌గా జమ్ము, లద్దాక్‌ తదితర ప్రాంతాల్లో విధులు నిర్వర్తించారు. 2025లో రిటైర్‌ అయ్యారు. అంతకుముందు నుంచే గ్రామంతో పాటు పరిసర గ్రామాల యువతకు ఆర్మీలో చేరేందుకు సలహాలు, సూచనలు అందించేవారు. వ్యాయామం తదితర శారీరకదారుఢ్యానికి అవసరమైన పరికరాలకు ఆర్థిక సాయం అందించేవారు. విధుల నుంచి గ్రామానికి వచ్చిన తర్వాత ప్రత్యక్షంగా శిక్షణ అందిస్తూ అవసరమైన సలహాలు ఇచ్చారు. ఆయన శిక్షణనిచ్చిన వారిలో రెండెళ్లలో సుమారు 25 మంది యువకులకు ఆర్మీలో ఉద్యోగాలు సాధించారు. యువతకు ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని, ఎవరైనా రావచ్చని చెబుతున్నారు. అప్పుడు దేశసేవలో.. ఇప్పుడు యువతను తీర్చిదిద్దే పనిలో తరిస్తున్న ఆయనను పలువురు అభినందిస్తున్నారు.

కార్గిల్‌ పోరాటం మరిచిపోలేనిది

కార్గిల్‌ పోరాటంలో పాల్గొనడం నా జీవితంలో చిరస్మరణీయ ఘట్టంగా మిగిలిపోతుంది. దేశరక్షణలో పాలుపంచుకో వడంతో పాటు దేశం కోసం జరిగిన యుద్ధంలో పాల్గొనడం, విజ యాన్ని సాధించడం భారతీయుడిగా గర్వంగా భావిస్తున్నాను.

– పాశం పెంటారెడ్డి, బండవెల్కిచర్ల,

జిల్లా రిటైర్డ్‌ ఆర్మీ ఉద్యోగుల సంఘం

అధ్యక్షుడు,వికారాబాద్‌

మంత్రి వెంకటేశం,

బండవెల్కిచర్ల

వెంకటేశం ఆధ్వర్యంలో శిక్షణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement