వానలు సరిగాలేక తూర్పు గొంతెండుతోంది..
సాక్షి, సిటీబ్యూరో: మహానగరంలో వాన విచిత్రం.. పశ్చిమ, దక్షిణ ప్రాంతాల్లో జోరుగా కురవగా, నగరానికి తూర్పు దిక్కుల్లో విస్తరించి ప్రాంతాల్లో ఆశించిన స్థాయిలో వర్షాలులేవు. ఈ సీజనల్‌లో ఆలస్యంగా వర్షాలు మొదలుకాగా, అందులోనూ లోటు వర్షపాతం నమోదైంది. జూన్, జూలై, ఆగస్టు నెలల్లో నమోదవాల్సిన సగటు వర్షపాతంలో తూర్పు వైపున గణనీయమైన లోటు కనిపిస్తోంది. ఆకాశంలో మేఘాలు దట్టంగా పడుతున్నా, గాలి మళ్లిపోవడమో, లోకల్ మైక్రో–కై ్లమేట్ ప్రభావమో చినుకులు నేలను తాకకుండానే దాటిపోతున్నాయి. దీంతో ఈ ప్రాంత భూగర్భజలాలకు ఆశించిన స్థాయిలో నీటిచేరిక లభించలేదు. రుతుపవన మేఘాల గమనం పశ్చిమ నియోజకవర్గాల మీదుగా సాగడం వల్ల ఈ దిక్కుల్లో జలకళ తొణికిసలాడుతోంది. గచ్చిబౌలి, శంషాబాద్, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, పటాన్‌చెరు, హైటెక్ సిటీ, మాదాపూర్, చాంద్రాయణగుట్ట, శంషాబాద్‌ను ఆనుకుని ఉన్న పరిసరాల్లో కురిసిన భారీ వర్షాలు సగటు నమోదును’అధిక’కేటగిరీకి చేర్చాయి. రానున్న రోజుల్లో నగరంలో తుఫాను ద్రోణి గమనంలో మార్పులు వస్తే తప్ప తూర్పు ప్రాంతంలోని లోటు భర్తీ అయ్యే అవకాశం లేదని వాతావరణ నిపుణులు అంటున్నారు. నగరం మొత్తం సగటు వర్షపాతం గణాంకాల ప్రకారం సాధారణ స్థాయికి సమీపంలో కనిపించినప్పటికీ, భౌగోళికంగా చూస్తే మాత్రం తూర్పు దాహం తీరాల్సి ఉంది.
మహానగరంలో లోటు వర్షపాతం సెం.మీ.లలో ఇలా..
ప్రాంతం సాధారణం కురిసింది లోటు
శాతం
దుండిగల్ 35.77 19.71 45
మేడ్చల్ 32.85 19.35 41
ఘట్‌కేసర్ 34.25 20.19 41
కీసర 31.08 18.59 40
తిరుమలగిరి 33.70 21.03 38
కాప్రా 29.28 18.99 35
అల్వాల్ 30.00 19.54 35
మల్కాజిగిరి 30.10 19.74 34
ఉప్పల్ 33.41 22.29 33
ఇంకా 27 శాతం తక్కువ వర్షపాతం
సాధారణ స్థితిలో పశ్చిమ, దక్షిణ ప్రాంతాలు


