అనంతగిరి: వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి మహిపాల్ హెచ్చరించారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సోమవారం సీఐటీయూ, ఏఐకేఎంఎస్, ఏఐకేఎస్, డీవైఎఫ్‌ఐ, కేవీపీఎస్, ప్రజాసంఘాల ఆధ్వర్యాన వికారాబాద్‌లో నిరసన చేపట్టారు. ఆర్‌అండ్‌బీ అతిథి గృహం నుంచి ఎమ్మార్పీ చౌరస్తా వరకు ర్యాలీ తీశారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ.. కార్మికులకు కనీస వేతనాలను అమలు చేయాలన్నారు. బీజేపీ తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లతో పాటు విద్యుత్ సవరణ చట్టం, ఉపాధి కూలీలకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన వీబీజీరామ్‌జీ బిల్లును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అటవీ హక్కుల చట్టాన్ని నీరుగారుస్తున్న మోదీ సర్కార్ మొండి వైఖరి వీడాలని, రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ యూనియన్ల ముఖ్య నాయకులు మహేందర్, సురేష్, సతీష్, గోపాల్‌రెడ్డి, తేజ, శ్రీనివాస్, అనసూయ, లక్ష్మి, నవీన్, మల్లేశ్, లక్ష్మమ్మ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
వికారాబాద్‌లో కార్మిక సంఘాల నిరసన
మోదీ సర్కార్ మొండి వైఖరి
వీడాలని నినాదాలు


