పరిగి: అనుమతుల పేరిట పంచాయతీ కార్యదర్శి అధికంగా డబ్బులు వసూలు చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని రూప్‌ఖాన్‌పేట్ గ్రామస్తులు శనివారం ఆరోపించారు. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన మహేశ్, హమీద్‌లు తమ ఇళ్ల అనుమతుల కోసం కార్యదర్శిసంతోషను సంప్రదించగా.. ఆమె రూ.32 వేలకు బదులు 45 వేలు డిమాండ్ చేసింది. ఈ మేరకు సదరు వ్యక్తులు కార్యదర్శి భర్తకు ఫోన్‌పే ద్వారా నగదు చెల్లించారు. అయినప్పటికీ అనుమతి పత్రాలు అని పేర్కొంటూ నకిలీ పత్రాలు అందజేశారని వారు పేర్కొన్నారు. ఇలా తమ వద్దే కాకుండా.. చాలామంది దగ్గర కార్యదర్శి అధికంగా డబ్బులు వసూలు చేసిందన్నారు. ఆమైపె చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదే విషయమై ఎంపీఓ ఖరీంను వివరణ కోరగా.. విచారణ అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.


