నిందితుడికి రిమాండ్
దోమ: దివ్యాంగురాలైన యువతిపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ సంఘంటన దోమ ఠాణా పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఎస్‌ఐ వసంత్ జాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధి గూడూర్‌లో గ్రామానికి చెందిన మంగళి వెంకటేశ్(30).. ఈ నెల 6న మాటలు రాని, సరిగా నడవలేని యువతి(18)పై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విషయం బాధితురాలి తల్లికి తెలియడంతో.. ఆమె తన తమ్ముడికి తెలిపింది. అతను శుక్రవారం సాయంత్రం నిందితుడిని ప్రశ్నించగా, ఎలాంటి సమాధానం చెప్పలేదు. దీంతో సదరు వ్యక్తికి దేహశుద్ది చేసి, పోలీసులకు అప్పగించారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టగా.. వెంకటేశ్ నేరం అంగీకరించాడు. ఈ మేరకు అతని కేసు నమోదు చేశారు. శనివారం పరిగి మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచి, రిమాండ్‌కు తరలించామని ఎస్‌ఐ తెలిపారు.
మీర్‌పేట: టీకేఆర్ ఇంజినీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించిన ‘క్వాంటం అరీనా హ్యాకథాన్’ జాతీయ స్థాయి కార్యక్రమం శనివారంతో ముగిసింది. ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ తీగల హరినాథ్‌రెడ్డి, కోశాధికారి అమర్‌నాథ్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు 1,500 విద్యార్థులు, డెవలపర్లు పాల్గొని సరికొత్త ఆలోచనలతో డిజిటల్ పరిష్కారాలైన అప్లికేషన్లు, వెబ్‌సైట్లు, ఏఐ మోడల్స్ కనిపెట్టే కోడింగ్ పోటీలతో పాటు మెషిన్ లెర్నింగ్, వెబ్, యాప్ డెవలప్‌మెంట్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ వంటి నూతన సాంకేతికతలపై టాస్క్‌లు ఇవ్వడం జరిగిందన్నారు. 36 గంటల పాటు నిరంతరాయంగా కొనసాగి తక్కువ సమయంలో ఎక్కువ బృందాలుగా ఏర్పడి కొత్త ఆవిష్కరణలను సృష్టించడమే లక్ష్యమన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ రామస్వామిరెడ్డి, వివిధ విభాగ అధిపతులు, సిబ్బంది పాల్గొన్నారు.


