వివాహిత అదృశ్యం | - | Sakshi
Sakshi News home page

వివాహిత అదృశ్యం

Aug 9 2026 8:47 AM | Updated on Aug 9 2026 8:47 AM

వివాహిత అదృశ్యం జిల్లాస్థాయి వాలీబాల్‌ పోటీలు షురూ తుర్కయంజాల్‌: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న బాలికలను క్రీడల్లో ప్రోత్సహించడంతో, వారిలో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు మెరుగవుతాయని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ఉపాధ్యక్షురాలు, మాజీ కౌన్సిలర్‌ కొత్తకుర్మ మంగమ్మ తెలిపారు. షైన్‌ ఎన్‌జీఓ ఆధ్వర్యంలో జిల్లాలోని 10 పాఠశాలలకు చెందిన బాలికలకు ఎంపవర్‌ గర్ల్స్‌ విత్‌ స్పోర్ట్స్‌ అనే పేరుతో నిర్వహించిన జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా షైన్‌ ఎన్‌జీఓ వ్యవస్థాపకురాలు సీహెచ్‌.పరమేశ్వరి మాట్లాడుతూ.. బాలికల సాధికారత కేవలం విద్యతోనే కాకుండా, క్రీడల ద్వారా కూడా సాధ్యమవుతుందని పేర్కొన్నారు. టీజీపీఈటీఎస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, కాంగ్రెస్‌ తొర్రూర్‌ డివిజన్‌ అధ్యక్షుడు ఒర్సు శ్రీనివాస్‌ పాల్గొన్నారు. క్యామ మల్లేశ్‌కు మాజీ మంత్రి పరామర్శ మేకగూడ సింగిల్‌విండో చైర్మన్‌గా ప్రభాకర్‌

యాలాల: వివాహిత అదృశ్యమైన సంఘటన మండల పరిధి కిష్టాపూర్‌లో చోటుచేసుకుంది. ఎస్‌ఐ విఠల్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందినలక్ష్మిని పదిహేనేళ్ల క్రితం ఇదే మండలం బెన్నూరుకు పెద్దపులి శ్రీనుకి ఇచ్చి వివాహాం చేశారు. దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో శనివారం భర్తతో గొడవపడిన లక్ష్మి.. మధ్యాహ్నం కిష్టాపూర్‌లోని పుట్టింటికి వచ్చింది. ఆ సమయంలో కుటుంబీకులు పొలం పనుల్లో ఉన్నారు. లక్ష్మి ఇంటికి వచ్చిన విషయం తెలుసుకున్న ఆమె సోదరుడు పెద్ద కిష్టప్ప.. ఇంటికి వచ్చి చూడగా.. సోదరి కనిపించలేదు. ఇదే విషయమై ఫోన్‌లో లక్ష్మి అత్తగారిని సంప్రదించగా.. ఆమె ఇక్కడికి రాలేదని తెలిపారు. అనంతరం ఆమె కోసం తెలిసిన వారి వద్ద, చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో కిష్టప్ప పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.

ఇబ్రహీంపట్నం: బీఆర్‌ఎస్‌ భువనగిరి పార్లమెంట్‌ ఇన్‌చార్జి క్యామ మల్లేశ్‌ను శాసనసభ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హరీశ్‌రావు పరామర్శించారు. ఇటీవల క్యామ మల్లేశ్‌ స్వల్ప అస్వస్థతకు గురై వనస్థలిపురంలోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ మేరకు శనివారం హరీశ్‌రావు, ఎల్‌బీనగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డితో కలిసి ఆయన నివాసానికి వెళ్లారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

కొత్తూరు: మేకగూడ సింగిల్‌విండో చైర్మన్‌గా ఎస్‌బీపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్‌ అంబటి ప్రభాకర్‌ నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ శనివారం తన క్యాంపు కార్యాలయంలో ఆయనతో పాటు నూతనంగా ఎన్నికై న డైరెక్టర్లకు నియామకపు పత్రాలు అందజేశారు. అనంతరం ఆయన కార్యాలయంలో పాలకవర్గంతో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభాకర్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వం నుంచి రైతులకు వచ్చే ప్రతీ పథకాన్ని వారు సద్వినియోగం చేసుకునే విధంగా కృషి చేస్తానన్నారు. తనపై నమ్మకంతో పదవిని అప్పగించడం పట్ల ఆయన ఎమ్మెల్యేతో పాటు కాంగ్రెస్‌ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement