అబ్దుల్లాపూర్‌మెట్: బాటసింగారం జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థి రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో ప్రతిభ చాటాడు. శనివారం హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ ప్రధాన అథ్లెటిక్స్ స్టేడియంలో నిర్వహించిన తెలంగాణ 12వ రాష్ట్రస్థాయి జావెలిన్ డే సెలబ్రేషన్ పురుషులు, మహిళలు, సబ్ జూనియర్, జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్–2026లో అండర్–16 బాలుర జావెలిన్ త్రో విభాగంలో పాల్గొని కాంస్య పతకం సాధించాడు. ఆగస్టు 1న సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో సత్తాచాటి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించిన ధనాంజనేయులు పతకం సాధించడంపై హెచ్‌ఎం ప్రతాప్, ఉపాధ్యాయ బృందం, సర్పంచ్ గౌరీ శంకరాచారి, ఉపసర్పంచ్ వెంకటేశ్, తల్లిదండ్రులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.


