ఇబ్రహీంపట్నం: దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. ఎంఆర్‌ఆర్ ఫౌండేషన్, మల్‌రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో మల్‌రెడ్డి అభిషేక్‌రెడ్డి నేతృత్వంలో పోలీసు ఉద్యోగాల సాధనే లక్ష్యంగా నిరుద్యోగ యువతకు ఇచ్చే ఉచిత శిక్షణ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ఆదివారం ఇబ్రహీంపట్నంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పోలీసు ఉద్యోగార్థులు శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మన జిల్లాకు పోలీసు ఉద్యోగాల పోస్టులు లేవని ఆందోళన చెందొద్దని.. కొన్ని కారణాలతో ఇక్కడి ప్రక్రియ ఆగిందని వెల్లడించారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, వీలైనంత త్వరగా నోటిఫికేషన్ ఇచ్చేలా కృషిచేస్తానని హామీ ఇచ్చారు. అప్పటి వరకు చదువుపై దృష్టి సారించాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే రాయపోల్ గ్రామంలో మహంకాళి బోనాల వేడుకల్లో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలో రూ.20 లక్షలతో ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో నిరించనున్న సీసీ రోడ్డు, రూ.50లక్షల హెచ్‌ఎండీఏ నిధులతో నిర్మించిన సీసీ రోడ్డుకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో ఏసీపీ కేపీవీ రాజు, సీఐ మహేందర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ గురునాథ్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు మహిపాల్, పాండురంగారెడ్డి, ఈసీ శేఖర్‌గౌడ్, జయమ్మ, గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ భాస్కరాచారి, కౌన్సిలర్లు ఇందూరి శ్రీనివాస్, బాను, రాందాసు, రాయపోల్ సర్పంచ్ మమత శ్రీశైలం, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మంఖాల కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి


