కొడంగల్ రూరల్: అర్ధశతాబ్దం తర్వాత పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనంతో ఒక్కచోట చేరారు. పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన 1965–70 ప్రభుత్వ మల్టీపర్పస్ ఉన్నత పాఠశాల విద్యార్థుల బృందం పట్టణంలోని కేఎస్‌వీ(మురారి) ఫంక్షన్ హాలులో నిర్వహించిన కార్యక్రమంలో జ్ఞాపకాలను నెమరేసుకుని సందడిగా గడిపారు. ఈ సందర్భంగా ఆధునిక క్యాన్సర్ థెరానోస్టిక్స్, ఫొటోఆక్టివ్ సిస్టమ్స్‌పై పరిశోధనలు చేస్తున్న పూర్వ విద్యార్థి డాక్టర్ రాకేశ్ మెంగ్జీని రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఆర్.గురునాథ్‌రెడ్డి సన్మానించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్.గురునాథ్‌రెడ్డి, విశ్రాంత జిల్లా న్యాయమూర్తి ఈ.జగన్నాథ్‌రెడ్డి, ఉస్మానియా వర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్ గోపాల్‌రెడ్డి, రిటైర్డ్ జీహెచ్‌ఎం ఎం.రాంరెడ్డి, కంటి వైద్యులు డాక్టర్ కేవీ రాములు, రిటైర్డ్ ప్రిన్స్‌పాల్ పి.జనార్దన్‌రావు, కన్వీనర్ యూ.శ్రీనివాస్‌రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేశారు.


