ఆలయానికి వెళ్లి వచ్చేసరికి ఇల్లు బుగ్గి | - | Sakshi
Sakshi News home page

ఆలయానికి వెళ్లి వచ్చేసరికి ఇల్లు బుగ్గి

Aug 10 2026 7:26 AM | Updated on Aug 10 2026 7:26 AM

లంగర్‌హౌస్‌: ఆలయానికి వెళ్లి వచ్చేసరికి ఇల్లు బూడిద అయింది. ఈవీ చార్జింగ్‌ సమయంలో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. లంగర్‌హౌస్‌ బాపునగర్‌లో మూడంతస్తుల భవనంలో దశరథ్‌గౌడ్‌ కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు నివసిస్తున్నారు. కింద పార్క్‌ చేసిన ద్విచక్రవాహనానికి రెండో అంతస్తు నుంచి కేబుల్‌ వైర్‌తో చార్జింగ్‌ పెట్టారు. ఆదివారం ఆషాడమాసం బోనాల వేడుకల్లో అందరూ అమ్మవారి ఆలయానికి బోనంతో వెళ్లారు. కొద్దిసేపటికి ఈ చార్జర్‌ వల్ల రెండో అంతస్తులో షార్ట్‌ సర్క్యూట్‌ జరిగింది. నిమిషాల్లోనే మంటలు వ్యాపించి ఆ అంతస్తు పూర్తిగా దగ్ధం అయింది. మంటలు పక్క ఇళ్లలోకి వ్యాపించే సమయంలో స్పందించిన మురళి అనే స్థానికుడితోపాటు మరో వ్యక్తి కలిసి పక్క భవనం నుంచి దూకి ప్రాణాలకు తెగించి మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే వేడిగా మారిన రెండు సిలిండర్‌లను పోలీసులు జాగ్రత్తగా అక్కడి నుంచి తరలించారు. దాదాపు రూ.20 లక్షల ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు.

ఈవీ చార్జింగ్‌తో అగ్ని ప్రమాదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement