మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సర్దార్ పురుషోత్తం రావు
తాండూరు టౌన్: మున్నూరు కాపులు సంఘటితం కావాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సర్దార్ పుట్టం పురుషోత్తంరావు పటేల్ అన్నారు. మంగళవారం పట్టణంలోని తులసీ గార్డెన్‌లో సంఘం పట్టణ అధ్యక్షుడు పట్లోళ్ల బాల్‌రెడ్డి అధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పురుషోత్తంరావు పటేల్ మాట్లాడుతూ.. మున్నూరు కాపులంతా ఐకమత్యంగా ఉంటూ ఇతర కులాలను కలుపుకుని బహుజన రాజ్యాధికారం వైపు అడుగులు వేయాలన్నారు. సంఘం బలోపేతానికి కృషి చేయాలని, సంఘటితంగా ఉంటేనే ఏదైనా సాధించవచ్చన్నారు. సమావేశంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పట్లోళ్ల నర్సింలు, రామారావు, రాష్ట్ర కార్యదర్శి శ్రీధర్, నాయకులు శంకర్, నగేష్, అనంత ప్రసాద్, బుచ్చప్ప, నరేష్, నరేందర్, వెంకట్రామ్ రెడ్డి, రాములు, కిరణ్ పాల్గొన్నారు.


