అక్రమ నిర్మాణాలు ఆపాలి
అనంతగిరి: వికారాబాద్ పట్టణంలోని రామయ్యగూడ, రాజీవ్ గృహకల్పలో 40, 60 గజాలలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మాణాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మైపాల్ డిమాండ్ చేశారు. మంగళవారం ఈ మేరకు తహసీల్దార్ లక్ష్మీనారాయణకు వినతిపత్రం అందజేశారు. రామయ్యగూడలో ప్రభుత్వ భూమిలో 40, 60 గజాల స్థలం ప్రభుత్వం 2007 సంవత్సరంలో పేదలకు పట్టాలు ఇచ్చిందన్నారు. కాగా ఇక్కడ అసలైన లబ్ధిదారులు కాకుండా ఇతరులు అక్రమంగా రాత్రికి రాత్రే నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపించారు. దీంతో అర్హులైన పేదలకు అన్యాయం జరిగే అవకాశం ఉందన్నారు. చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యుడు సుదర్శన్, నాయకులు శ్రీనివాస్, సతీష్, రమేష్, యండీ అజర్, నజీర్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.


