నిలిచిన నీటి సరఫరా | - | Sakshi
Sakshi News home page

నిలిచిన నీటి సరఫరా

Jul 15 2026 12:05 PM | Updated on Jul 15 2026 12:05 PM

కలెక్టరేట్‌ వద్ద కాలనీ వాసుల ఆందోళన

బంట్వారం: కోట్‌పల్లి మండలం ఎన్నారం ఐదో వార్డులో నీటి సరఫరా నిలిచిపోవడంతో కాలనీ వాసులు మంగళవారం కలెక్టరేట్‌ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. తహసీల్దార్‌ ఆదేశాలతో నీటి సరఫరా ఆగిపోయిందనే సమాచారం రావడంతో రెవెన్యూ కార్యాయాలనికి వెళ్లామని తెలిపారు. తహసీల్దార్‌ ఆనందర్‌రావు వివరణ కోరగా నీటి సమస్యకు తనకు ఏమిటి సంబంధం అని చెప్పడంతో కలెక్టరేట్‌ వద్దకు చేరుకొని నిరసన తెలిపారు. వికారాబాద్‌ డీఎస్పీ అంజయ్య, కోట్‌పల్లి ఎస్‌ఐ శైలజ ఎన్నారం గ్రామానికి వెళ్లి గ్రామస్తులతో మాట్లాడారు. సమస్య పరిష్కారం దిశగా చర్యలు చేపట్టారు. ఈ విషయమై సర్పంచ్‌ అనిల్‌కుమార్‌ సంప్రదించగా ట్యాంకర్‌ ద్వారా సపఫరా చేస్తున్నామన్నా రు. మరమ్మత్తు పనుల కారణంగా ఐదో వార్డులోని కొన్ని ఇళ్లకు నీటి సమస్య ఏర్పడిందన్నారు. త్వరితగతిన సరఫరా చేస్తామన్నారు. ప్రస్తుతానికి ట్యాంకర్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామస్తులు కాలనీ వాసులు సహకరించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement