ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు
బొంరాస్‌పేట: రైతులు పర్యావరణ హితమైన వ్యవసాయ పద్ధతులు పాటించాలని ఇక్రిశాట్ శాస్త్రవేత్తల మమతశర్మ, జగదీశ్, రమణగౌడ, రాజేంద్రప్రసాద్ సూచించారు. మంగళవారం మండలంలోని చౌదర్‌పల్లిలో ఎస్‌బీఐ ఫౌండేషన్ ప్రాజెక్టు, పంటల ఆధారిత స్మార్ట్ గ్రామీణాభివృద్ధి కార్యక్రమం కింద సుస్థిరమైన వ్యవసాయాభివృద్ధికి ఇక్రిశాట్ కృషి చేస్తుందన్నారు. కంది రైతులకు పర్యావరణ హిత వ్యవసాయ పద్ధతుల ద్వారా మంచి దిగుబడి సాధించవచ్చన్నారు. అలాగూ ట్రైకోడర్మా, సుడోమోనాస్, రైజోబియం, ఫాస్పేట్ కరిగించే బ్యాక్ట్టీరియా వంటి జీవనియంత్రణ కిట్లను రైతులకు అందజేశారు. కందిపంట సస్యరక్షణ, దశవారి వ్యాధు లు, పంటలకు తీసుకునే చర్యలను వివరించారు.


