కుల వృత్తులకు కేసీఆర్‌ అండ | Sakshi
Sakshi News home page

కుల వృత్తులకు కేసీఆర్‌ అండ

Published Tue, Jun 20 2023 3:40 AM

లబ్ధిదారులకు గొర్రెలను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి  - Sakshi

కొడంగల్‌: గొల్లకురుమల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో బొంరాస్‌పేట మండలం ఎనికెపల్లికి చెందిన 12 మంది లబ్ధిదారులకు గొర్రెలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుల వృత్తులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ సబ్సిడీపై గొర్రెలు ఇస్తున్నట్లు చెప్పారు. 20 గొర్రెలు, ఒక పొట్టేలు ఇస్తున్నట్లు తెలిపారు. యూనిట్‌ను ధరను రూ. లక్షా 75వేలకు పెంచినట్లు చెప్పారు. ఇందులో లక్షా 31వేల 250 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నట్లు చెప్పారు. లబ్ధిదారులు తమ వాటా కింద రూ.43,750 చెల్లిస్తే సరిపోతుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కౌన్సిలర్‌ మధు యాదవ్‌, మాజీ సర్పంచ్‌ రమేష్‌బాబు, గొల్ల కురుమ సంఘం నాయకులు, పశువైద్యాధికారులు పాల్గొన్నారు.

పర్యావరణాన్ని కాపాడుదాం
పట్టణంలోని మున్సిపల్‌ పార్క్‌లో ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ జగదీశ్వర్‌రెడ్డి సోమవారం మొక్కలు నాటారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హరిత్సోవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ ఉషారాణి, కమిషనర్‌ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, కౌన్సిలర్లు మధుసూదన్‌రావ్‌ యాదవ్‌, రమేష్‌, మాజీ సర్పంచ్‌ రమేష్‌బాబు, మహిళా సమాఖ్య సభ్యులు ఆనందమ్మ, అన్నపూర్ణ, మున్సిపల్‌ సిబ్బంది క్రాంతి, భరత్‌ పాల్గొన్నారు.

మొక్కలను సంరక్షించాలి
దౌల్తాబాద్‌:
హరితహారం కింద నాటిన మొక్కలను సంరక్షించాలని ఎమెల్యే నరేందర్‌రెడ్డి సూచించారు. సోమవారం మండల కేంద్రంలో హరితోత్సవంలో భాగంగా పెద్ద చెరువు కట్టపై మొక్కలను నటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతి ఏటా హరితహారం నిర్వహిస్తోందన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ మహిపాల్‌, ఎంపీపీ విజయ్‌కుమార్‌. వైస్‌ ఎంపీపీ మహిపాల్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, ఎంపీడీఓ తిరుమల స్వామి, ఏపీఓ రంజిత్‌ కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement