మరో విజయ ప్రస్థానానికి నాంది ప్రజా సేవలో ముందుందాం సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి ఉద్భోద కూటమి అరాచకాలను ఎదుర్కొన్న క్యాడర్‌కు రుణపడి ఉంటా సైదాపురం జెడ్పీటీసీ విజయం జగనన్నకు కానుక విజేతలు, పరాజితుల ఆత్మీయ సమావేశంలో ఉద్ఘాటన
వెంకటగిరి(సైదాపురం): వెంకటగిరి నియోజకవర్గ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్నో ఆటంకాలు, ఒత్తిళ్లు, బెదిరింపులు, ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా పార్టీ కోసం ధైర్యంగా సైనికుల్లా పోరాడిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అభినందనీయులని వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రాదేశిక ఎన్నికల్లో పార్టీ విజేతలు, పరాజితులకు మంగళవారం ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి ఆయన పేరు పేరునా అభినందించారు. కూటమి ప్రభుత్వ అరాచకాలకు ధైర్యంగా ఎదురొడ్డి నిలబడిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను ప్రజలే ప్రశంసిస్తున్నారన్నా రు. గెలుపోటములతో నిమిత్తం లేకుండా చివరిక్ష ణం వరకు పార్టీకోసం పోరాడిన ప్రతి అభ్యర్థి, నా యకుడు, కార్యకర్తలకు కృషిని ప్రత్యేకంగా అభినందిస్తున్నామన్నారు. అందరి త్యాగాలు, కష్టం, నిబద్ధత ఎప్పటికీ వృధా కావని స్పష్టం చేశారు. సైదాపురం జెడ్పీటీసీ స్థానాన్ని కై వసం చేసుకోవడం అందరి సమష్టి పోరాటానికి నిదర్శనమన్నారు. ఈ విజ యాన్ని అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కానుకగా ఇస్తామని, అంతేగాకుండా సైదాపురం, వెంకటగిరి ఎంపీపీ స్ధానాలను కూడా సాధించబోతున్నామని, ఈ విజయాలు నియోజకవర్గంలో పార్టీకి మరింత బలం, నూతనోత్తేజాన్ని ఇస్తాయన్నారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజా సేవలో ముందుండాలని, జగనన్న బాటలో పయనించాలని కర్తవ్యోపదేశం చేశారు. ఈ పోరాటం ఇంతటితో ముగియలేదని, ఇది మరో విజయ ప్రస్థానానికి నాంది మాత్రమేనని అభివర్ణించారు. ఐక్యంగా మరింత పట్టుదల, ఉత్సాహంతో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.


