చంద్రగిరి : ఎస్వీ వెటర్నరీ వర్సిటీలో మాంస ఉత్పత్తుల విలువ ఆధారిత, సుస్థిర సంస్కరణపై బుధవారం జాతీయస్థాయి వర్క్‌షాప్‌ను ప్రారంభించారు. ముఖ్య అతిథిగా వీసీ డాక్టర్ వైకుంఠరావు హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. వీసీ మాట్లాడుతూ దేశంలో మాంస ఉత్పత్తులు గణనీయంగా ఉన్నప్పటికీ, ప్రాసెసింగ్ రంగం ప్రారంభ దశలోనే ఉందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద పశుసంపద కలిగిన దేశాల్లో మన దేశం ఒకటైనప్పటికీ, పోస్ట్–హార్వెస్ట్ విలువ ఆధారిత ఉత్పత్తులు 2శాతానికి కంటే తక్కువగానే ఉన్నాయని తెలిపారు. రిజిస్ట్రార్ డాక్టర్ ఆర్.వినూ మాట్లాడుతూ పశుసంవర్ధక రంగంలో విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ పోషకాహార అత్యవసరంగా మారుతుందన్నారు. వర్క్‌షాప్ కో–ఆర్డినేటర్ డాక్టర్ జి.విజయ భాస్కరరెడ్డి మాట్లాడుతూ పరిశోధనల ఫలితాలను వాణిజ్య సరళిలోకి తీసుకెళ్లి గ్రామీణ మహిళలు, స్వయం సహాయక సంఘాలు, విద్యార్థులు, నూతన పారిశ్రామికవేత్తలకు ప్రాసెసింగ్ రంగంలో అవసరమైన నైపుణ్యాలను అందించడమే ఈ శిక్షణ ముఖ్య ఉద్దేశమని వివరించారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి 60 మందికి పైగా ప్రతినిధులు, పరిశోధకులు, శాస్త్రవేత్తలు, పరిశ్రమల ప్రతినిధులు ఈ రెండు రోజుల వర్క్‌షాప్‌లో పాల్గొనున్నట్లు వెల్లడించారు. అనంతరం బుక్‌లెట్‌ను విడుదల చేశారు. డీన్ డాక్టర్ సురేష్ కుమార్, అసోసియేట్ డీన్ డాక్టర్ పి. మాలకొండయ్య, అధికారులు సురేష్ కుమార్, కొండయ్య, నదీమ్ ఫైరోజ్ పాల్గొన్నారు.


