గ్రామీణం.. గరం గరం | - | Sakshi
Sakshi News home page

గ్రామీణం.. గరం గరం

Nov 12 2026 5:24 AM | Updated on Nov 12 2026 5:24 AM

● ప్రభుత్వ వైఖరిపై రైతుల ఆగ్రహం ● పథకాలు అందడం లేదని మండిపాటు ● సంక్షేమానికే జైకొడతామంటున్న పల్లెవాసులు

తిరుపతి అర్బన్‌ : పురపాలక పోరులో పార్టీలు కీలకపాత్ర పోషిస్తాయి. ప్రాదేశిక సమరంలోనూ ఆయా పార్టీల గుర్తులే గెలుపోటములను ప్రభావితం చేస్తాయి. అయితే పంచాయతీ ఎన్నికల్లో ప్రత్యక్షంగా రాజకీయ పార్టీల ప్రమేయం ఉండదు. పార్టీల గుర్తులు కనిపించవు. గ్రామీణ ప్రాంతవాసులు తమకు నచ్చిన వ్యక్తి ఎంపిక చేసుకున్న గుర్తుపై ఓటు వేయాల్సి ఉంటుంది. తమకు మంచి చేస్తాడనుకునే వారినే ఎన్నుకునే వెసులుబాటు వస్తుంది. ఈ క్రమంలోనే పల్లెసీమల్లో రచ్చబండల వద్ద గ్రామీణులు ముమ్మరంగా చర్చించుకుంటున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో చేకూరిన లబ్ధిని గుర్తుచేసుకుంటున్నారు. చంద్రబాబు సర్కారు వచ్చిన తర్వాత కుదేలైన వ్యవసాయరంగంపై అభిప్రాయాలు పంచుకుంటున్నారు. ఏది ఏమైనా సంక్షేమానికే జైకొట్టాలని మెజారిటీ ప్రజలు స్పష్టం చేస్తున్నారు. పోలింగ్‌ రోజు వరకు గుంభనంగా ఉంటూ ఓటు ద్వారా తమ తీర్పును వెలువరించేందుకు సన్నద్ధమవుతున్నారు.

98శాతం రైతులే...

గ్రామీణ ప్రాంతాల్లో 98శాతం మంది రైతులే ఉంటారు. ప్రధానంగా 60శాతం మంది వ్యవసాయ పంటలపై, 12 శాతం మంది పాడి పరిశ్రమ, 8శాతం మంది మత్స్య, 20శాతం మంది ఉద్యాన పంటల సాగుపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అయితే అన్నదాతలకు కూటమి సర్కార్‌లో భరోసా కరువైంది. దీంతో పల్లె జనం మండిపడుతున్నారు. రెండున్నరేళ్లలో మన పంచాయతీలో రైతులకు చేసింది ఏంటీ అంటూ ప్రశ్నిస్తున్నారు. సబ్సిడీ విత్తనాలు, పనిముట్లు, యూరియా, అన్నదాత సుభీభవ, ఉచిత పంట బీమా తదితరాలను ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై రైతులు మండిపడుతున్నారు.

పడిపోయిన వేరుశనగ సాగు

వేరుశనగ సాగులో రాష్ట్రంలోనే అనంతపురం తర్వాత తిరుపతి జిల్లా రెండో స్థానంలో ఉండేది. అయితే రెండేళ్లుగా వేరుశెనగ సాగు ఊసే లేకుండా పోయింది. గతంలో అన్నదాతలకు 50 శాతం రాయితీతో వేరుశనగ విత్తనాలను ప్రభుత్వమే అందించేది. అయితే రెండేళ్లుగా వేరుశనగ విత్తనాలు రేట్లు పెరిగాయనే సాకుతో ఎగనామం పెట్టారు. అలాగే పిల్లిపెసర, జీలగలు, జనుము విత్తనాలు తూతూ మంత్రంగా ఇచ్చి చేతులుదులుపుకున్నారు.

లక్ష మందికి లేని సుఖీభవ

అన్నదాత సుభీభవ పథకానికి జిల్లాలో సుమారుగా లక్ష మంది రైతులు దూరమయ్యారు. పాత వాళ్లకే సుభీభవ పథకం వర్తింపజేశారు. కొత్తగా ఈకేవైసీ చేసుకువారికి పైసా విదల్చలేదు. దీంతో వారంతా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా రైతులందరికీ సకాలంలో రైతు భరోసా పథకం కింద పెట్టుబడి నిధి అందించారు.

ఉచిత బీమా ఊసేలేదు

చంద్రబాబు పాలనలో ఉచిత బీమా ఊసేలేకుండా పోయింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పంటలు సాగు చేస్తున్న అందరు రైతులకు (100శాతం రైతులకు) బీమా చెల్లించేది. నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ అందించేవారు. అయితే చంద్రబాబు పాలనలో ఉచిత పంట బీమాను రద్దు చేశారు. పంట బీమా కావాలంటే రైతులే ప్రీమియం చెల్లించుకోవాలని తెగేసి చెప్పేశారు. ఇన్‌పుట్‌ సబ్సిడీని సైతం ఎగొట్టేశారు. ఈ అంశంపై రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement