తిరుపతి అర్బన్ : పంచాయతీ ఎన్నికల్లో విధులు నిర్వర్తించే ఉద్యోగులకు భద్రత అవసరమని ఏపీ జేఏసీ చైర్మన్ ఎస్. సురేష్‌బాబు కోరారు. బుధవారం ఈ మేరకు కలెక్టరేట్లో కలెక్టర్ వెంకటేశ్వర్‌కు వినతిపత్రం అందించారు. ఆయనకు ఓ వినతిపత్రాన్ని అందించారు. ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఎన్నికల విధులు కేటాయించేటప్పుడు వారి వయసు, ఆరోగ్య పరిస్థితులు, వ్యక్తిగత ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ఇటీవల నిర్వహించిన పరిషత్ ఎన్నికల్లో ఉపాధ్యాయులను సుదూర ప్రాంతాలకు పంపడం, 60 ఏళ్లు దాటిన వారికి కూడా విధులు కేటాయించడంతో అవస్థలు పడ్డారని తెలిపారు. 55 ఏళ్లు దాటిన వారికి ఆర్ఓ విధుల నుంచి, 60 ఏళ్లు దాటిన వారికి ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఎన్నికల డ్యూటీ సమయంలో సిబ్బందికి భోజనం, మంచినీటి సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కౌంటింగ్ విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు న్యాయబద్ధమైన రెమ్యునరేషన్ చెల్లించాలని, రిజర్వ్‌లో ఉంచిన వారికి సైతం పారితోషికం ఇప్పించాలని సూచించారు. నేతలుఎస్.వెంకట ముని, ముత్యాల రెడ్డి, శ్రీనివాసులు, హేమగిరి దేవరాల నిర్మల, వాసు, లలిత్ కుమార్ గణేష్, సుభాషిని కుమార్ పాల్గొన్నారు.


