జయచంద్రకు ఉత్తమ ప్రిన్సిపల్‌ అవార్డు | - | Sakshi
Sakshi News home page

జయచంద్రకు ఉత్తమ ప్రిన్సిపల్‌ అవార్డు

Nov 12 2026 5:18 AM | Updated on Nov 12 2026 5:18 AM

తిరుపతి సిటీ:స్థానిక కరకంబాడి రోడ్డులోని శ్రీరామ అటానమస్‌ ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపల్‌ కే జయచంద్రకు జేఎన్‌టీయూఏ ఉత్తమ ప్రిన్సిపాల్‌ అవార్డు ప్రదానం చేసింది. అనంతపురంలోని జేఎన్‌టీయూ లో బుధవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో వీసీ సుదర్శన రావు చేతుల మీదు గా అవార్డుతో పాటు నగదు బహుమతిని అందుకున్నారు. శ్రీరామ కళాశాల చైర్మన్‌ మన్నెం రామిరెడ్డి మాట్లాడుతూ 16 సంవత్సరాలుగా జయచంద్ర తమ కళాశాలలో ప్రిన్సిపాల్‌ పనిచేస్తున్నారని తెలిపారు. కళాశాల ఎదుగుదలతో పాటు విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. ఆయన కృషిని గుర్తించి యూనివర్సిటీ ఉత్తమ ప్రిన్సిపల్‌ అవార్డు అందజేయడం సంతోషంగా ఉందన్నారు. కళాశాల సెక్రటరీ మన్నెం రామసుబ్బారెడ్డి, డైరెక్టర్‌ మన్నెం అరవింద్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ ఈ అవార్డు కళాశాలకు ఎంతో గర్వకారణమని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ప్రిన్సిపల్‌ను కళాశాల బోధన, బోధనేతర సిబ్బంది అభినందించారు.

అడిగిన స్వీట్‌ బాక్స్‌ ఇవ్వలేదని దాడి

శ్రీకాళహస్తి : స్వీటు బాక్స్‌ ఇవ్వలేదని ఓ వ్యాపారిపై దాడి చేసిన ఘటన మంగళవారం శ్రీకాళహస్తిలో జరిగింది. వివరాలు.. పట్టణంలోని ఓ కుదువ దుకాణారికి ఓ వ్యక్తి వచ్చాడు. ఈ సందర్భంగా వ్యాపారి తన కస్టమర్‌కు దీపావళి సందర్భంగా ఓ స్వీట్‌ బాక్స్‌ ఇచ్చాడు. అయితే పనికిరాని స్వీట్‌ బాక్స్‌ కాదని, మంచిది ఇవ్వాలని ఆ వ్యక్తి ఆగ్రహంతో దుకాణదారుడిపై దాడి చేశాడు. దీనిపై బాధితుడు వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో ఆగ్రహం వ్యక్తం చేసిన మార్వాడీ వ్యాపారులు తమ వారిపై దాడి చేసిన వ్యక్తి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు దాడికి పాల్పడిన వ్యక్తి వచ్చి బాధితుడికి క్షమాపణ చెప్పడంతో మార్వాడీ వ్యాపారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement