ఎన్నికలా.. యుద్ధాలా? | - | Sakshi
Sakshi News home page

ఎన్నికలా.. యుద్ధాలా?

Nov 11 2026 12:19 AM | Updated on Nov 11 2026 12:19 AM

● చంద్రగిరి నియోజకవర్గంలో అడుగడుగునా దాడులు, దౌర్జన్యాలే ● ఆరు పోలింగ్‌ కేంద్రాల్లో రిగ్గింగ్‌.. ఐదు వేలకుపైగా దొంగ ఓట్లు ● హింసాత్మక ఘటనల వీడియోలను చూపిన చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి

తిరుపతి రూరల్‌: చంద్రగిరి నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదని, నామినేషన్లనుంచి కౌంటింగ్‌ వరకు దాడులు, దౌర్జన్యా లు చోటు చేసుకున్నాయని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి ఆరోపించా రు. తిరుపతి రూరల్‌ మండలం, తుమ్మలగుంటలోని చంద్రగిరి నియోజకవర్గ వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించిన వీడియోలను మీడియా ముందు ప్రదర్శించారు. ఆ వీడియోలు చూసిన వారెవ్వరికై నా చంద్రగిరి నియోజకవర్గంలో జరిగింది స్థానిక ఎన్నికలా..? యుద్ధమా..? అన్న అనుమానం కలుగుతుందన్నారు. గత 25 రోజులుగా నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ అభ్యర్థులు, ముఖ్య నేతలపై ఎమ్మెల్యే పులివర్తి నాని, ఆయన కుటుంబీకులు, అనుచరులు అరాచకం సృష్టించారని తెలిపారు. ఆరు మండలాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులు నామినేషన్లు వేయకూడదంటూ ఎమ్మెల్యే నాని హెచ్చరికలు చేశారని ఆరోపించారు. ఐదు వేల మంది కిరాయి వ్యక్తులను రంగంలోకి దించి దౌర్జన్యాలకు పాల్పడ్డారని, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని వ్యవహార శైలిని, రౌడీ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. నామినేషన్లు వేసేందుకు వచ్చిన వైఎస్సార్‌సీపీకి చెందిన 22 మంది నాయకులపై దాడులు చేసి గాయపరిచారని, నామినేషన్లు వేసిన 225 మంది అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించారని ఆరోపించారు. అధికారులు కూడా టీడీపీకి అనుకూలంగా వ్యవహరించారన్నారు. తిరుపతికి చెందిన టీడీపీ ముఖ్య నేతలు తిరుపతి రూరల్‌ మండలంలో మకాం వేసి రిగ్గింగ్‌కు పాల్పడ్డారని తెలిపారు.

యథేచ్ఛగా రిగ్గింగ్‌.. హైకోర్టుకు ఆధారాలు

పోలింగ్‌ సందర్భంగా పలు కేంద్రాల్లో రిగ్గింగ్‌ జరిగినట్లు ఆధారాలు సేకరించామని మోహిత్‌రెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోలను హైకోర్టుకు సమర్పించినట్లు తెలిపారు. ఒక్క తిరుపతి రూరల్‌ మండలంలోనే ఐదు వేలకుపైగా ఓట్లు రిగ్గింగ్‌ ద్వారా పోలయ్యాయని, తమకు రావాల్సిన 1,600 ఓట్లను చెల్లనివిగా పరిగణించారన్నారు. ఎన్నికల అక్రమాలపై వైఎస్సార్‌సీపీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిందని, న్యాయపోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. గాంధీపురం ఎంపీటీసీ స్థానంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గెలిచినప్పటికీ మూడు సార్లు రీకౌంటింగ్‌ చేసినా తమ అభ్యర్థికే ఆధిక్యం వచ్చిందన్నారు. అయినా చివరకు టీడీపీ అభ్యర్థిని గెలిచినట్లు ప్రకటించారని విమర్శించారు. హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ సప్తగిరి కాలనీలో జనరల్‌ ఏజెంట్‌గా ఉన్న వైఎస్సార్సీపీ నేత అశోక్‌రెడ్డిని, సాయినగర్‌లో జనరల్‌ ఏజెంట్‌గా ఉన్న శశిధర్‌రెడ్డి అక్రమంగా అరెస్టు చేశారని, చిన్నగొట్టిగల్లు మండల ఎంపీపీ అభ్యర్థి నాగలక్ష్మి భర్త సహదేవరెడ్డిని అరెస్టు చేసి జైలుకు పంపించారన్నారు.

ఎస్పీ పసుపు చొక్కా వేసుకున్నారు

తిరుపతి ఎస్పీ పసుపు చొక్కా వేసుకున్న టీడీపీ కార్యకర్తలా ఎన్నికల్లో పనిచేశారని మోహిత్‌రెడ్డి తెలిపారు. పోలీసు యంత్రాంగం నిష్పక్షపాతంగా వ్యవహరించలేదని, అందువల్లనే చాలా వరకు టీడీపీకి ఏకగ్రీవమయ్యాయని ఆరోపించారు. పాకాల, రామచంద్రాపురం, చంద్రగిరి మండలాల్లో పోలింగ్‌ రోజున చోటుచేసుకున్న అక్రమాలపై న్యాయపోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. త్వరలో అక్కడ రీపోలింగ్‌ జరిగేలా, అక్రమాలకు ఊతమిచ్చిన అధికారులు సస్పెండ్‌ అయ్యేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. తిరుపతి రూరల్‌ జెడ్పీటీసీ సభ్యుడు చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి, పేరూరు–2 ఎంపీటీసీ సభ్యుడు దామినేటి కేశవులు, వైఎస్సార్సీపీ బీసీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెరుకుల జనార్దన్‌ యాదవ్‌, పార్టీ నేత తులసీరెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement