డిసెంబర్‌లో తిరుపతికి ప్రధాని | - | Sakshi
Sakshi News home page

డిసెంబర్‌లో తిరుపతికి ప్రధాని

Nov 11 2026 12:19 AM | Updated on Nov 11 2026 12:19 AM

తిరుపతి అర్బన్‌: తిరుపతికి డిసెంబర్‌ మొదటి వారంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ విచ్చేయనున్నారు. ఈ క్రమంలో అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేపడుతున్నట్టు కలెక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌ తెలిపారు. మంగళవారం ఆయన కలెక్టరేట్‌లో జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, జేసి గోవిందరావు, తిరుపతి కార్పొరేషన్‌ కమిషనర్‌ జయకృష్ణ, డీఆర్వో నరసింహులుతో కలసి అధికారులతో సమీక్షించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ తిరుపతి వేదికగా డిసెంబర్‌ మొదటి వారంలో డీజీపీలు, ఐజీపీల జాతీయ స్థాయి కాన్ఫరెన్స్‌ జరగనున్న నేపథ్యంలో ఆ కాన్ఫరేన్స్‌కు హాజరయ్యే జాతీయ స్థాయి ప్రముఖుల వసతి, భద్రత తదితర మౌలిక సదుపాయాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలన్నారు. ఐసర్‌, ఐఐటీ చేపట్టాల్సిన ఏర్పాట్లను పరిశీలించేందుకు అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించాలన్నారు. సమావేశంలో తిరుపతి మున్సిపల్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ శారదాదేవి, తుడా కార్యదర్శి శ్రీకాంత్‌, ఏపీఎస్పీడీసీఎల్‌ ఎస్‌ఈ చంద్రశేఖర్‌రావు, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ రాజానాయక్‌, విమానాశ్రయ అధికారి భూమినాథన్‌, తిరుపతి, శ్రీకాళహస్తి ఆర్డీఓలు రామ్మోహన్‌, భానుప్రకాష్‌రెడ్డి, అదనపు ఎస్పీలు రవిమనోహరాచారి, శ్రీనివాసరావు, రామకృష్ణ, శ్రీనివాస్‌, శ్రీలత తదితరులు పాల్గొన్నారు.

శ్రీవారి దర్శనానికి 20 గంటలు

తిరుమల: తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. సోమవారం క్యూలైన్‌ శిలాతోరణం వద్దకు చేరింది. సోమవా రం అర్ధరాత్రి వరకు 83,609 మంది స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.95 కోట్లు సమర్పించారు. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 20 గంటల సమయం పడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement