73 రైళ్ల దారి మళ్లింపు | - | Sakshi
Sakshi News home page

73 రైళ్ల దారి మళ్లింపు

Nov 11 2026 12:19 AM | Updated on Nov 11 2026 12:19 AM

తిరుపతి అర్బన్‌: రేణిగుంట రైల్వే యార్డు ఆధునీకరణ పనుల్లో భాగంగా ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌లాకింగ్‌ వ్యవస్థ ఏర్పాటు నేపథ్యంలో ప్రయాణికులు, వ్యాపారులకు కలగనున్న అసౌకర్యాలు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై గుంతకల్‌ డివిజన్‌ సీనియర్‌ అధికారి సత్యనారాయణ, తిరుపతి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌తో చర్చించారు. మంగళవారం కలెక్టరేట్‌కు వెళ్లి కలెక్టర్‌ను కలిసిన సత్యనారాయణ పలు అంశాలను తెలియజేశారు. ఆధునీకరణ పనుల్లో భాగంగా మంగళవారం (నవంబర్‌ 10) నుంచి డిసెంబర్‌ 27 వరకు 48 రోజుల పాటు 73 రైళ్లను దారి మళ్లిస్తున్నట్టు చెప్పారు. అలాగే 36 రైళ్లు పూర్తిగా రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. యార్డు ఆధునీకరణ పనుల వివరాలు, రైళ్ల రాకపోకల్లో మార్పులు, సరుకు రవాణాపై ప్రభావం, ప్రత్యామ్నాయ ఏర్పాట్ల గురించి తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement