తిరుపతి అర్బన్ : పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వేడి పల్లెలకు చేరుకుంది. జిల్లా వ్యాప్తంగా 777 సర్పంచ్‌లు, 7,210 వార్డు సభ్యులకు ఈ నెల 26, 29వ తేదీన రెండు విడతలుగా ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో సర్పంచ్‌లకు 25 గుర్తులను, వార్డు సభ్యులకు 20 గుర్తులను ఎంపిక చేశారు.
సర్పంచ్ అభ్యర్థులకు..
టెలిఫోన్, బల్ల, మొక్కజొన్న, పలక, ద్రాక్షపండ్లు, తిరగలి, కుండ, మంచం, కత్తెర, ఉంగరం, బుట్ట, వంకాయ, సాసర్, క్యారెట్, తాళం చెవి, గొలుసు, కుర్చీ, బ్యాట్, అరటిపండు, కొవ్వొత్తులు, నల్లబోర్డు, అనాస పండు, షటిల్, చేతికర్ర, చెంచా గుర్తులు కేటాయించారు.
డిపాజిట్ తప్పనిసరి
నామినేషన్ ఫారాలతోపాటు సర్పంచ్‌గా పోటీచేస్తున్న అన్‌రిజర్వుడు అభ్యర్థి డిపాజిట్ కింద రూ.3 వేలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు అయితే రూ.1,500 డిపాజిట్‌గా చెల్లించాల్సి ఉంటుంది. అలాగే వార్డు సభ్యుడికి అన్‌రిజర్వుడు అభ్యర్థి అయితే రూ.1,000, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.500 దరావత్తు కట్టాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే 10వేలకు తక్కువ జనాభా గల పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థి రూ.2.50 లక్షలు, 10వేలకు మించి జనాభా ఉంటే సర్పంచ్ అభ్యర్థి రూ.4 లక్షలు మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుంది. అలాగే వార్డు సభ్యులకు సంబంధించి 10 వేలకు తక్కువ జనాభా ఉంటే రూ.60వేలు, 10వేల కంటే ఎక్కువ జనాభా ఉంటే రూ. లక్ష మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుంది.
వార్డు సభ్యులకు..
ప్రెషర్ కుక్కర్, గౌను, స్టూల్, ఇస్ట్రీపెట్టె, పోస్ట్ డబ్బా, గ్యాస్ స్టౌ, బీరువా, ఐస్‌క్రీమ్, డిష్ యాంటెన్నా, రంపం, కెమెరా, క్యారమ్ బోర్డు, వయోలిన్, బెండకాయ, బెల్లు, కోటు గుర్తులు ఎంపిక చేశారు.


