హామీల డాబు.. | - | Sakshi
Sakshi News home page

హామీల డాబు..

Nov 13 2026 8:45 AM | Updated on Nov 13 2026 8:45 AM

దగ్గరపడ్డ ఇంజినీరింగ్‌ సెమిస్టర్‌ పరీక్షలు

ఫీజు కడితేనే హాల్‌టిక్కెట్‌ అంటున్న

కళాశాల యాజమాన్యాలు

అయోమయంలో తల్లిదండ్రులు

తిరుపతి సిటీ: చంద్రబాబు సర్కార్‌ పాపం.. పేద విద్యార్థుల పాలిట శాపంగా మారింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందక జిల్లాలో వేల మంది విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారు. లోకేష్‌ యువగళం పాదయాత్ర, చంద్రబాబు ఎన్నికల సమయంలో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ క్రమంతప్పకుండా అందిస్తామని ప్రగల్భాలు పలికారు. దాదాపు మూడేళ్లుగా రెండు విడతలు మాత్రమే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేసి చేతులెత్తేశారు. దీంతో జిల్లాలో పలు యూజీ కోర్సులు చదువుతున్న విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారింది.

ఉన్నత విద్యకు దూరం

ప్రభుత్వం పేద విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేసే కుట్ర జరుగుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించకపోవడంతో ప్రైవేటు కళాశాలలు 2026–27 విద్యా సంవత్సరంలో అడ్మిషన్ల సమయంలో ఫీజు చెల్లించాల్సిందేనని, ఫీజురీయింబర్స్‌మెంట్‌ పై నమ్మకం పెట్టుకోవద్దని తేల్చిచెప్పాయి. దీంతో చాలామంది విద్యార్థులు ఇంటర్‌తోనే చదువును నిలిపివేసినట్లు విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.

47 వేల మంది విద్యార్థులకు శాపం

కూటమి ప్రభుత్వంలో జిల్లాలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హులైన దాదాపు 47,360 మంది విద్యార్థులకు శాపంగా మారింది. ప్రైవేటు కళాశాలల్లో డిగ్రీ, ఇంజినీరింగ్‌, పలు రకాల వైద్యవిద్యలో యూజీ కోర్సులను అభ్యసిస్తున్న విద్యార్థుల భవితవ్యం ఆగమ్యగోచరంగా మారింది. జిల్లాలో అర్హులైన విద్యార్థులకు సుమారు 542.69కోట్ల బకాయిలు అందాల్సి ఉంది. కళాశాలల యాజమాన్యాలు ఫీజుల చెల్లిస్తేగాని హాల్‌టిక్కెట్లు ఇవ్వమని బెదిరిస్తుండగా మరికొన్ని కళాశాలలు కోర్సు పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ధృవపత్రాలు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాయి.

ఆప్షనే లేదు

చంద్రబాబు ప్రభుత్వంలో పొరుగు రాష్ట్రాల్లో చదువుతున్న విద్యార్థుల పరిస్థితీ మరీ దయనీయంగా మారింది. ఎస్సీ, ఎస్టీలకు మినహా మిగిలిన బీసీ, కాపు, ఈబీసీ, క్రిస్టియన్‌, ముస్లిం మైనారిటీ విద్యార్థులకు కనీసం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు ఆన్‌లైన్‌ ఆప్షన్‌ కూడా ఇవ్వలేదు. దీంతో పొరుగు రాష్ట్రాల్లో యూజీ కోర్సులు చదువుతున్న సుమారు 6,500 మంది విద్యార్థులు సొంతగా ఫీజు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఉన్నత విద్యనభ్యసిస్తున్న ప్రతి విద్యార్థికీ అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫీజురీయింబర్స్‌మెంట్‌ అవకాశాన్ని కల్పించి ఆదుకున్నారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదలగాక అవస్థలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement