యువగళంలో లోకేష్ విద్యార్థులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. కనీసం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు సైతం చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తం సుమారు రూ.7వేల కోట్ల బకాయిలు చెల్లించాలి. ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వాన్ని హెచ్చరించాం. కూటమి కుట్రతో ఫీజు చెల్లించలేని పేద విద్యార్థులు బలవుతున్నారు.
–ప్రవీణ్, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి, తిరుపతి
గుణపాఠం తప్పదు
ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లిస్తామని నమ్మించారు. ఆశతో ఎంతో మంది పేద విద్యార్థులు బీటెక్‌తో పలు యూజీ కోర్సుల్లో చేరారు. తీరా బాబు సర్కార్ చేతులెత్తేసింది. మోసపోయామని విద్యార్థులు మానసింకంగా కుంగిపోయి ఆత్మహత్యాయత్నాలు చేసుకుంటున్నారు. బాధాకరమైన విషయం. కూటమికి యువత తగిన గుణపాఠం చెప్పడం ఖాయం.
–ప్రేమ్ కుమార్, ఎస్వీయూ వైఎస్సార్‌సీపీ
విద్యార్థి విభాగం అధ్యక్షుడు, తిరుపతి
పీడిస్తున్నాయ్
కూటమి సర్కార్ అధికారం చేపట్టిన నాటి నుంచి విద్యార్థులకు నరకం చూపిస్తోంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ రాకపోవడంతో ఫీజు చెల్లించాల్సిందేనని కళాశాల యాజమాన్యాలు పీడిస్తున్నాయి. ప్రస్తుతం ఇంజినీరింగ్ కోర్సుల్లో పలు సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ సమయంలో విద్యార్థులపై ఒత్తిడి పెంచడం బాధాకరం.
– శివశంకర్ నాయక్,
జీఎన్‌ఎస్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు
●
కఠిన చర్యలు తీసుకోవాలి
జిల్లాలోని పలు ఇంజినీరింగ్ కళాశాలల్లో ఫీజు వేధింపుల తార స్థాయి చేరాయి. యాజమాన్యాల వేధింపులతో ఎంతోమంది విద్యార్థులు ఆత్మహత్యాయత్నాలకు ప్రయత్నిస్తున్నారు. ఇంత దారణమైన పరిస్థితి గతంలో చూడలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విద్యావ్యవస్థ అస్తవ్యస్తమైంది. వేధింపులకు గురిచేస్తున్న కళాశాలలపై విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలి.
– మానస, మేఘన, సాహితి, దేవకి, పీడీఎస్‌యూ మహిళా నేతలు


