ఐక్యూఏసీ డైరెక్టర్‌గా రమేష్‌బాబు | - | Sakshi
Sakshi News home page

ఐక్యూఏసీ డైరెక్టర్‌గా రమేష్‌బాబు

Nov 13 2026 8:45 AM | Updated on Nov 13 2026 8:45 AM

తిరుపతి సిటీ: జాతీయ సంస్కృత వర్సిటీ ఇంటర్నల్‌ క్వాలిటీ అస్సూరెన్స్‌ సెల్‌ (ఐక్యూఏసీ) డైరెక్టర్‌గా గణిత విభాగం సీనియర్‌ ప్రొఫెసర్‌ వీ.రమేష్‌బాబు నియమితులయ్యారు. ఈ మేరకు రిజిస్ట్రార్‌ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. ఆయన ఈ పదివిలో తదుపరి ఉత్తర్వులు అందే వరకు కొనసాగనున్నారు. ఈ సందర్భంగా వర్సిటీ బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు ఆయనకు అభినందనలు తెలిపారు.

స్వీమ్స్‌లో త్వరలో సంజీవని టెలీమెడిసన్‌ సేవలు

తిరుపతి తుడా: స్విమ్స్‌ ఆస్పత్రిలోని తొమ్మిది వైద్య విభాగాల్లో త్వరలో సంజీవని టెలీమెడిసన్‌ సేవలు ప్రారంభించనున్నట్లు డైరెక్టర్‌ డాక్టర్‌ జగదీష్‌ తెలిపారు. గురువారం స్విమ్స్‌ శ్రీపద్మావతి ఆడిటోరియంలో డాక్టర్‌ ఎన్టీఆర్‌ వైద్య సేవ విభాగంతో ఆయన ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ డాక్టర్‌ ఎన్టీఆర్‌ వైద్యసేవ పథకం అమలులో రాష్ట్ర స్థాయిలో స్విమ్స్‌ విశేష ప్రగతి సాధించడం గర్వకారణమన్నారు. అక్టోబర్‌లో 2,519 మంది రోగులకు రూ.11.85 కోట్ల మేర వైద్యసేవలందించినట్టు వెల్లడించారు. అర్హులైన ప్రతి పేద రోగిని గుర్తించి, వారికి డాక్టర్‌ ఎన్టీఆర్‌ వైద్యసేవ పథకం ద్వారా నాణ్యమైన వైద్యసేవలందించాలని సిబ్బందిని ఆదేశించారు. తొలి దశలో కార్డియాలజీ, డెర్మటాలజీ, ఎండోక్రైనాలజీ, జనరల్‌ సర్జరీ, మెడికల్‌ ఆంకాలజీ, జనరల్‌ మెడిసిన్‌, ప్రసూతి, సీ్త్రరోగాలు, పీడియాట్రిక్స్‌, ఆర్థోపెడిక్స్‌ విభాగాలను టెలీమెడిసన్‌ కార్యక్రమానికి ఎంపిక చేసినట్లు వెల్లడించారు.

బీసీలకు తగ్గిన

సర్పంచ్‌ స్థానాలు

తిరుపతి అర్బన్‌: స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఈ నెల 26, 29న రెండు విడతల్లో జిల్లా వ్యాప్తంగా సర్పంచ్‌ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఆ దిశగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే రిజర్వేషన్లు చూస్తే బీసీలకు కేటాయించిన సర్పంచ్‌ స్థానాల సంఖ్య తగ్గించారు. అన్‌ రిజర్వుడు స్థానాలే అధికంగా ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 807 పంచాయతీలు ఉండగా 30 పంచాయతీల్లో కోర్టు కేసుల నేపథ్యంలో ఎన్నికలు నిలుపుదల చేశారు. దీంతో 777 పంచాయతీల్లో మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో అన్‌ రిజర్వుడుకు పురుషులకు 194, మహిళలకు 204 మొత్తం 399 కేటాయించారు. అలాగే బీసీల్లో పురుషులకు 42, మహిళలకు 52 మొత్తం 94 స్థానాలు కేటాయించారు. ఎస్సీల్లో పురుషులకు 114, మహిళలకు 101, మొత్తం 215 స్థానాలు, అలాగే ఎస్టీల్లో పురుషులకు 45, మహిళలకు 25 మొత్తం 70 స్థానాలు కేటాయింపు చేశారు. మొత్తంగా చూస్తే బీసీల స్థానాలు తగ్గించడంపై ఆ సామాజిక వర్గ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement