మర్యాదపూర్వక కలయిక | - | Sakshi
Sakshi News home page

మర్యాదపూర్వక కలయిక

Nov 13 2026 8:45 AM | Updated on Nov 13 2026 8:45 AM

శ్రీవారి దర్శనానికి 18 గంటలు

తిరుమల: తిరుమలలో గురువారం భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్‌ శిలాతోరణం వద్దకు చేరుకుంది. బుధవారం అర్ధరాత్రి వరకు 73,392 మంది స్వామిని దర్శించుకున్నారు. 33,288 మంది భక్తులు తలనీలాలు ఇచ్చారు. స్వామికి కానుకల రూపంలో హుండీలో రూ.3.90 కోట్లు వచ్చాయి. టైంస్లాట్‌ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని వారికి 18 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకుంటున్నారు. ఇదిలా ఉండగా సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ముందుగా వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించేది లేదని స్పష్టం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement