శ్రీకాళహస్తి: జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామిని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ సహాయ మంత్రి సావిత్రి ఠాకూర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దక్షిణ గోపురం వద్ద్ద ఈవో బీకే వెంకటేశులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ముందుగా వారు ప్రత్యేక రాహుకేతు సర్పదోష నివారణ పూజలు చేయించుకున్నారు. అనంతరం స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. మృత్యుంజయ స్వామి సన్నిధి వద్ద వేదపండివతులు వారిని ఆశీర్వదించి స్వామి, అమ్మవార్ల జ్ఞాపిక, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ అధికారులు పాల్గొన్నారు.
చెరువులోకి దూసుకెళ్లిన
ద్విచక్ర వాహనం
కేవీబీపురం: ద్విచక్ర వాహనం అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లాగా.. ఇద్దరు గాయపడిన ఘటన మండలంలోని మిద్దికండ్రిగ వద్ద మంగళవారం చోటు చేసుకుంది. వివరాలు.. తమిళనాడుకు చెందిన వీరరాఘవ (43), పార్దీబన్ (28) ద్విచక్ర వాహనంలో శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో పీకలదాకా మద్యం సేవించారు. ఈ క్రమంలో ఆరె గ్రామాన్ని దాటుకుని వెళ్తుండగా మిద్దికండ్రిగకు చెందిన చెరువు పక్కనే అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లారు. ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. గ్రామస్తులు వారిని శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. దీనిపై ఎలాంటి కేసు నమోదు కాలేదు.


