చంద్రగిరి: వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు మృతి చెందినట్లు తిరుచానూరు ఎస్ఐ సుధాకర్ తెలిపారు. ఈ నెల 5న శెట్టిపల్లి భారత్ పెట్రోల్ బంకు సమీపంలో 60 ఏళ్ల గుర్తుతెలియని వృద్ధుడు అపస్మాకర స్థితిలో ఉండడంతో స్థానికులు రుయాలో చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. అదేవిధంగా తిరుచానూరు సింధూ కూడలి వద్ద 70 సంవత్సరాల గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు మృతదేహానికి పంచనామా నిర్వహించి, తిరుపతి మెడికల్ కళాశాలలోని మార్చురీకి తరలించారు. మృతుల వివరాలు తెలిసిన వారు తిరుచానూరు పోలీసు స్టేషన్ సీఐ 94407 96755కు సంప్రదించాలని కోరారు.


