ప్రొఫెసర్‌ రాంబాబుకు అవార్డు | - | Sakshi
Sakshi News home page

ప్రొఫెసర్‌ రాంబాబుకు అవార్డు

Oct 1 2026 9:27 AM | Updated on Oct 1 2026 9:27 AM

చంద్రగిరి : ఎస్వీ వెటర్నరీ వర్సిటీ ప్రొఫెసర్‌ రాంబాబు నాయక్‌ ప్రతిష్టాత్మక యానిమల్‌ ఫిజియాలజిస్ట్‌ అసోసియేషన్‌ ఫెలో–2025 అవార్డుకు ఎంపికయ్యారు. ఈ నెల 5,6వ తేదీల్లో ఉత్తరప్రదేశ్‌లోని బనారస్‌ హిందూ విశ్వవిద్యాలయంలో ఆయన అవార్డును అందుకోనున్నారు. బుధవారం ఈ మేరకు వర్సిటీ డీన్‌ డాక్టర్‌ సురేష్‌ కుమార్‌, అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ మాలకొండయ్య అభినందనలు తెలిపారు.

మైకా గనుల్లో

డీఎంజీ తనిఖీలు

సైదాపురం : మండలంలోని గిద్దలూరు సమీపంలో ఉన్న రాధాకృష్ణ మైకా గనిని బుధవారం రాష్ట్ర డైరెక్టర్‌ ఆఫ్‌ మైన్స్‌ ఆఫ్‌ జియాలజీ అధికారి డబ్ల్యూబీ చంద్రశేఖర్‌ అకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ఆయన నెల్లూరు జిల్లాలోని సంగం ప్రాంతంలో ఉన్న ఇసుక క్వారీలను పరిశీలించి అనంతరం సైదాపురం మండలంలో పర్యటించినట్లు అధికారులు తెలిపారు. గనిలో జరుగుతున్న పనులను క్షేత్రస్ధాయిలో డీఎంజీ పరిశీలించారు. అనంతరం గూడూరు సమీపంలోని సిలికా మైన్‌కు వెళ్లినట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement