శ్రీసిటీ (వరదయ్యపాళెం): చైన్నెలో నిర్వహించిన నమస్తే ఏషియా సమ్మిట్– 2026లో శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని కీలక ప్రసంగం చేశారు. ఆసియా దేశాల కంపెనీలకు భారత్, ముఖ్యంగా దక్షిణ భారతదేశం అందిస్తున్న తయారీ, పెట్టుబడి, సరఫరా గొలుసు అవకాశాలను వివరించారు. ఆసియా దేశాల కంపెనీలు స్థానిక తయారీకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వలన, వాటితో పాటు సరఫరా గొలుసు కంపెనీలు తయారీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాయని తెలిపారు. దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం తరహాలో సీఐఐ నిర్వహించనున్న ’ది నీలగిరీస్ ఇండియా ఎకనామిక్ డైలాగ్’కు తన సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.
శ్రీవారి సేవలో ప్రముఖులు
తిరుమల: తిరుమల శ్రీవారిని బుధవారం పలువురు ప్రముఖులు సేవించుకున్నారు. వీరిలో నేషనల్ స్టడీ స్టాండింగ్ పార్లమెంటరీ కమిటీ చైర్మన్ హరేంద్ర సింగ్ మాలిక్, సినీ నటి పూజా చోప్రా, ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ ఉన్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.


