నవోదయ ప్రవేశ పరీక్ష దరఖాస్తుకు గడువు పెంపు | - | Sakshi
Sakshi News home page

నవోదయ ప్రవేశ పరీక్ష దరఖాస్తుకు గడువు పెంపు

Oct 1 2026 9:27 AM | Updated on Oct 1 2026 9:27 AM

తిరుపతి అర్బన్‌ :జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో 9వ, 11వ తరగతుల ప్రవేశ పరీక్షకు దరఖాస్తు గడువును ఈనెల 15వ తేదీ వరకు పొడిగించినట్లు కోచింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్‌.విశ్వనాథ్‌ రెడ్డి బుధవారం తెలిపారు. ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు 9వ తరగతిలో ప్రవేశానికి, 10వ తరగతి విద్యార్థులు 11వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని వివరించారు. నవోదయ ప్రవేశ పరీక్ష–2026లో విశ్వం విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందారని వెల్లడించారు. ఇతర వివరాలకు 86888 88802, 93999 76999 వరదరాజనగర్‌ లోని విశ్వం సైనిక్‌– నవోదయ పోటీ పరీక్షల శిక్షణ సంస్థను సంప్రదించవచ్చని సూచించారు.

వెంకన్నకు విరాళంగా వాహనాలు

చంద్రగిరి : శ్రీనివాస మంగాపురం శ్రీకల్యాణ వేంకటేశ్వర స్వామివారికి రూ.40లక్షల విలువైన బంగారు పూత పూసిన గజ వాహనం, సింహ వాహనాలను దాతలు విరాళంగా సమర్పించారు. బుధవారం ఉదయం ఈ వాహనాలను ఆలయ అధికారులకు అందజేశారు. హైదరాబాద్‌కు చెందిన పీవీ లక్ష్మి రెడ్డి సింహ వాహనాన్ని, వీపీ దివ్య ప్రియాంక గజ వాహనాన్ని ఆలయ స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ ఈఓ వరలక్ష్మికి అందజేశారు. దాతలకుస్వామివారి దర్శనం కల్పించారు. ఏఈవో గోపీనాథ్‌, సూపరింటెండెంట్‌ రాజ్‌ కుమార్‌, ఆలయ అర్చకులు బాలాజీ దీక్షితులు, నారాయణ చార్యులు పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి పోటీలకు

గురుకులం విద్యార్థినులు

డక్కిలి: నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో నిర్వహించిన జిల్లాస్థాయి క్రీడాపోటీల్లో డక్కిలి గురుకుల పాఠశాల విద్యార్థినులు ప్రతిభను ప్రదర్శించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపల్‌ పద్మజావాణి తెలిపారు. బుధవారం ఆమె మాట్లాడుతూ తమ విద్యార్థులు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికకావాలని ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థినులను అభినందించారు. ఎస్‌ఎంసీ చైర్మన్‌ సురేంద్ర , వైస్‌ ప్రిన్సిపల్‌ నాగమణి పాల్గ్గొన్నారు.

కరాటే శిక్షకుడికి

జపాన్‌లో గుర్తింపు

తిరుపతి కల్చరల్‌ : కరాటేలో విద్యార్థులను తీర్చిదిద్దుతున్న తిరుపతికి చెందిన శిక్షకుడు వెంకటేశ్వర్లుకు జపాన్‌లో గుర్తింపు లభించింది. బుధవారం యోకోహామాలో ర్ణాటక క్రీడా సాధికార సంస్థ ఉపాధ్యక్షుడు అరుణ్‌ మాచయ్య చేతులు మీదుగా ఆయన డబ్ల్యూస్‌కేఎఫ్‌ 1వ డాన్‌ గ్రేడింగ్‌ సర్టిఫికెట్‌ అందుకున్నారు.

టీటీడీకి విరాళంగా స్టవ్‌లు

తిరుమల: తమిళనాడుకు చెందిన పుష్కర్‌ ప్రాపర్టీస్‌ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కృతి వాసన్‌ బుధవారం తిరుమల శ్రీవారి ఆలయ పోటులో వడల తయారీకి అవసరమైన 4 పెద్ద స్టవ్‌లను విరాళంగా అందించారు. ఈమేరకు దాత తరఫున ఆ సంస్థ ప్రతినిధి మురళి తిరుమలలో శ్రీవారి ఆలయ పోటు ఏఈఓ మునిరత్నానికి స్టవ్‌లను అందజేశారు.

సెన్సార్‌ ట్రాక్‌పై అవగాహన అవసరం

తిరుపతి మంగళం : డ్రైవింగ్‌ టెస్ట్‌కు వచ్చే ముందు ట్రాక్‌లో ఏర్పాటు చేసిన సెన్సార్‌పై వాహనదారులకు పూర్తి అవగాహన అవసరమని జిల్లా రవాణాశాఖాధికారి కొర్రపాటి మురళీమోహన్‌ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ఇదివరకు ట్రాక్‌లో కాలు కిందపెట్టకుండా, సిగ్నిల్స్‌ వేస్తూ వాహనాలు డ్రైవ్‌ చేస్తే పాస్‌ అయ్యేవారన్నారు. ప్రస్తుతం ట్రాక్‌లో నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, లేకుంటే టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధించలేరన్నారు. అందుకే ప్రతి రోజు ఉదయం 10గంటలకు డ్రైవింగ్‌ టెస్ట్‌కు వచ్చే వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నామని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement