చంద్రగిరి : మోహన్ బాబు విశ్వవిద్యాలయం, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీకి చెందిన ’యంగ్ ఇండియన్స్’ మధ్య పరస్పర అవగాహన ఒప్పందం కుదిరింది. ఏ. రంగంపేట సమీపంలోని శ్రీ సాయినాథ్ నగర్‌లోని ఎంబీయూ ప్రాంగణంలో బుధవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో వర్సిటీ వీసీ పీవీ రమణ, రిజిస్ట్రార్ సారథి , డీన్ డాక్టర్ బాబు దేవసేనాపతితోపాటు యంగ్ ఇండియన్స్ తిరుపతి చాప్టర్ ప్రతినిధులు డి. నితిన్, యంగ్ ఇండియన్స్ తిరుపతి చైర్ హర్షద్ బాషా ఒప్పందం పత్రాలపై సంతకాలు చేసి పరస్పరం మార్చుకున్నారు. వీసీ రమణ మాట్లాడుతూ విద్యార్థులలో నైపుణ్యాభివృద్ధి, నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యతను పెంపొందించడమే లక్ష్యంగా ఈ ఒప్పందం జరిగిందన్నారు. విద్యార్థులు స్వయంగా వినూత్న ప్రాజెక్టులకు రూపకల్పన చేయడం, జాతీయ, ప్రాంతీయ స్థాయి సదస్సులలో పాల్గొనేలా ప్రోత్సహించడం ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు. సీఐఐ రీజినల్ డైరెక్టర్ దేవ్ జ్యోతి, ఎంబీయూ ఫైనాన్స్ డైరెక్టర్ రవిశేఖర్, యంగ్ ఇండియన్స్ తిరుపతి బ్రాండింగ్ కో–చైర్ తౌఫీక్ అహ్మద్, యంగ్ ఇండియన్స్ తిరుపతి లెర్నింగ్ చైర్ శ్రీకర్ పాల్గొన్నారు.


