వంతెన నిర్మాణంపై నిర్లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

వంతెన నిర్మాణంపై నిర్లక్ష్యం

Oct 1 2026 9:27 AM | Updated on Oct 1 2026 9:27 AM

● రహదారిపై గ్రామస్తుల ఆందోళన

నాయుడుపేట టౌన్‌ : మండలంలోని ఎంపీ చక్కెర పరిశ్రమ సమీపంలో మామిడి కాలువపై వంతెన కొద్ది రోజుల క్రితమే కూలిపోయిన విషయం తెలిసిందే. అయితే ఎన్‌హెచ్‌ , ఆర్‌అండ్‌బీ అధికారులు తమ పరిధి కాదంటూ ఎవరికి వారుగా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. అధికారుల తీరుపై బుధవారం వెంగమాంబపురం, పండ్లూరు గ్రామ స్తులు మండిపడ్డారు. కూలిన వంతెన వద్ద ఆందోళన చేపట్టారు. ఈ విషయమై పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ కూలిపోయిన బ్రిడ్జిని రోజుల తరబడి పట్టించుకోకుండా ఎన్‌హెచ్‌ అధికారులతో పాటు సంబంధిత శాఖ అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బ్రిడ్జి కూలిపోవడంతో సుమారు 8గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయని మండిపడ్డారు. వెంగమాంబపురంతో పాటు పండ్లూరు, సీతారామపురం, దేవుని కండ్రిగ, బట్ల కనుపూరు, పినపరియపాడు తదితర గ్రామాల ప్రజలు ఈ వంతెన మీదుగానే రాకపోకలు సాగించేవారని వెల్లడించారు. ఆ వంతెన కూలిపోవడంతో ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతూ పండ్లూరు సమీపంలోని జాతీయ రహదారిపై నుంచి నాయుడుపేట తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగించాల్సిన దుస్థితి దాపురించిందని వాపోయారు. అత్యవసర పరిస్థితుల్లో గర్భిణులు, అస్వస్థతకు గురైన వారిని నాయుడుపేటలోని ఆస్పత్రికి తరలించేందుకు వాహనాలు వెళ్లే మార్గంలేక చాలా దూరం తిరిగి పోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి కూలిన వంతెనను పునర్నిర్మించాలని డిమాండ్‌ చేశారు. ఈలోపు తాత్కాలికంగా రాకపోలు సాగించేందుకు ఏర్పాట్లు చేయాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement