కేవీబీపురం: జాతీయ సైన్స్ సెమినార్–2026లో కేవీబీపురం మండల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్, తిరుపతి జిల్లా విద్యాశాఖాధికారి కేవీఎన్ కుమార్ ఆదేశాల మేరకు కేవీబీపురం మండల విద్యాశాఖ అధికారి రవికుమార్ ఆధ్వర్యంలో కేవీబీపురం ఉన్నత పాఠశాల వేదికగా గురువారం మండల స్థాయి సైన్స్ సెమినార్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో కేవీబీపురం ఉన్నత పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థి ప్రజ్వల్‌రాజు ప్రథమ బహుమతి సాధించగా, అదే పాఠశాలకు చెందిన విద్యార్థిని ఎన్.యాన్సీమేరీ ద్వితీయ బహుమతి సాధించింది. ఇద్దరు విద్యార్థులు తమ ప్రసంగాలతో ఆకట్టుకున్నారు. హెచ్‌ఎం కూనాటి సురేష్, సైన్స్ ఉపాధ్యాయులు సత్య, సుబ్రహ్మణ్యం, ప్రకాష్, విజయ, విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులు జిల్లా స్థాయి జాతీయ సైన్‌న్స్ సెమినార్–2026లో పోటీల్లో పాల్గొననున్నట్టు ఎంఈఓ తెలిపారు.


