సింహ వాహనంపై యోగనరసింహుని అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్న కల్యాణ వేంకటేశ్వరుడు
తుమ్మలగుంటలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు మంగళవారం రాత్రి దేవేరులతో కలిసి శ్రీ కల్యాణ వేంకటేశ్వరుడు ముత్యపు పందిరి వాహనంపై బాలకృష్ణుడి అవతారంలో భక్తులకు అభయమిచ్చారు. ఉదయం స్వామివారు యోగ నరసింహుని అవతారంలో సింహ వాహనంపై కొలువుదీరి భక్తులను కటాక్షించారు. తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి సైతం యువకులతో కలిసి వాహనాన్ని మోశారు. సింహ వాహన సేవకు తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు, ముండ్లపూడి, బ్రాహ్మణపట్టు, పాడిపే ట ప్రాంతాల నుంచి భక్తులు సారెను తీసుకొచ్చి స్వామి వారికి సమర్పించారు. రాత్రి ముత్యపు పందిరి వాహన సేవకు ఎర్రావారిపాళెం మండలంలోని ఎర్రావారిపాళెం, చెరుకువారిపల్లి, యల్లమంద, ఉదయమాణిక్యం, ఉస్తికాయలపెంట, కోటకాడపల్లి, యల్లమంద, బోడేవాండ్లపల్లి, వీఆర్ అగ్రహారం, నెరబైలు, చింతగుంట, కూరపర్తివారిపల్లి, చెరకువారిపల్లికి చెందిన భక్తులు వస్త్రాలు తీసుకువచ్చి సమర్పించారు. వాహనసేవల్లో ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, చెవిరెడ్డి లక్ష్మి దంపతులు, ఈవో సుబ్రమణ్యంరెడ్డి పాల్గొన్నారు. – తిరుపతి రూరల్


