ఘనంగా ఆయుష్య హోమాలు, కోటి దీపోత్సవం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా ఆయుష్య హోమాలు, కోటి దీపోత్సవం

Sep 18 2026 1:09 AM | Updated on Sep 18 2026 1:09 AM

● సిద్ధార్థ కళాశాలలో ఆయుష్య హోమాలు, కోటి దీపోత్సవం

నారాయణవనం : స్థానిక సిద్ధార్థ ఇంజినీరింగ్‌ కళాశాల ఆవరణలో తొమ్మిది రోజుల పాటు తలపెట్టిన నవాహ్నిక హోమ కార్యక్రమంలో భాగంగా గురువారం హోమాలు, ధార్మికోపన్యాసం, సాయంత్రం దీపోత్సవం, వేణుగోపాలస్వామి ఊరేగింపు తదితర కార్యక్రమాలు నిర్వహించారు. చైర్మన్‌ అశోకరాజు ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్రమోదీ పేరున ఉదయం ఆయుష్య హోమం, మృత్యుంజయ హోమం లక్ష తులసి అర్చనలను నిర్వహించారు. సాయంత్రం ప్రవచనకర్త కుప్పా విశ్వనాథ శాస్త్రిచే ‘ధర్మము – పునరవలోకనం‘ ప్రవసచనం కొనసాగింది. సాయంత్రం హోమ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌ హాజరై శ్రీకృష్ణ వేణుగోపాలస్వామి విగ్రహాన్ని ఆవిష్కరించి, గోపూజ నిర్వహించారు. దీపో త్సవం అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి (వేణుగోపాల అలంకారంలో) పల్లకీ ఉత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మాధవ్‌, అశోకరాజు మాట్లాడుతూ 25 ఏళ్ల సూదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా, ప్రధాన మంత్రిగా పనిచేస్తున్న నరేంద్రమోదీ నాయకత్వంలో భారతదేశం విశ్వగురు స్థానానికి చేరుకుంటుందన్నారు. ఆధ్యాత్మిక వేడుకల్లో కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు, భక్తులు పాల్గొని స్వామివారి దివ్యాశీస్సులు అందుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement